ప్రత్యేక తోడేలు, కెసిఆర్ లాగే: జగన్‌పై ఆనం వివేకా
హైదరాబాద్/ ఖమ్మం : సమైక్యం ముసుగులో రాష్ట్ర విభజనకు సహకరిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని, ఆ పార్టీ ఎమ్మెల్యేలను నిలదీయాలని ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పిలుపునిచ్చారు. బెయిల్ కోసం జగన్ తన పార్టీ అధిష్టానంతో కుమ్మక్కయ్యాడని ఆరోపించారు. కెసిఆర్ మాదిరిగా జగన్ కూడా విభజనవాదేనని, జగన్ మేకతోలు కప్పుకొన్న ప్రత్యేక తోడేలని ఆయన అన్నారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ముఖ్యమంత్రితో పాటు తాము తమ అధిష్ఠానంపై తిరుగుబాటు చేస్తుంటే, జగన్ వారితో కుమ్మక్కై సమైక్య ముసుగులో రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నారని దుయ్యబట్టారు. సమైక్యాన్ని కోరుకుంటున్న ఏపీఎన్జీవోలు, విద్యార్థులు, ప్రజలు ఎక్కడికక్కడ జగన్‌ని ఆయన శాసనసభ్యులను నిలదీయాలన్నారు.
సీమాంధ్రలో సమైక్యవాదాన్ని వినిపిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి తెలంగాణ జిల్లాల్లో కనీసం పార్టీ సభ్యత్వం కూడా లేదని ఆయన ఎద్దేవా చేశారు. విభజనకు ఓకే చెబుతూనే తెలుగుదేశం నేతలు సమన్యాయమనడం దివాళకోరుతనమని మల్లాది విష్ణు అన్నారు. సమన్యాయంపై తెలుగుదేశం నేతలు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై నమ్మకం లేకపోతే తుపాకీ పట్టి అడవికి వెళ్లాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వైయస్సార్ కాంగ్రెసు నాయకులకు సూచించారు. తెలంగాణ బిల్లు విషయంలో వైసిపి తీరు రాజ్యాంగ స్ఫూర్తికి మచ్చతెచ్చేలా ఉందని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీలో అభిప్రాయాలు చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. వి
శాలాంధ్ర బుక్‌హౌస్ ప్రారంభోత్సవానికి గురువారం ఖమ్మం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బిల్లు విషయంలో కాంగ్రెస్ వైఖరి కూడా మోసపూరితంగా ఉందని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ కూడా అవకాశవాదంతో వ్యవహరిస్తోందని, తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తేనే రాష్ట్రంలో పొత్తుపెట్టుకుంటామని చంద్రబాబు మోడీతో ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ కలిసివస్తే పొత్తు పెట్టుకుంటామన్నారు.


Click it and Unblock the Notifications