మరింత క్షీణించిన ఆనం వివేకానంద రెడ్డి ఆరోగ్య పరిస్థితి
ప్రత్యేకించి ఉపోద్ఘాతం అక్కరలేని పాపులర్ పొలిటీషియన్, టిడిపి నేత ఆనం వివేకానందరెడ్డి...అయితే ఆరోగ్యం బాగాలేని కారణంగా ఆయన గత కొంతకాలంగా హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ర్ హాస్పటల్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది అని వైద్యులు కుటుంబసభ్యులకు తెలిపినట్లు సమాచారం. ఆయన ఆరోగ్య స్థితిని బట్టి వైద్యులు ఎప్పటికప్పుడు మెరుగైన వైద్యం అందిస్తున్నా ఆయన ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు కుటుంబానికి తెలిపినట్లు చెబుతున్నారు. ఆనం వివేకా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలియడంతో ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు, మంత్రి నారా లోకేష్ నాయుడు,మంత్రులు ,ఇతర పార్టీ నేతలు హైదరాబాద్ వెళ్లి ప్రత్యేకంగా ఆయనను పరామర్శించి వచ్చారు.













Click it and Unblock the Notifications