ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రైల్వేస్టేషన్ అందుబాటులోకి రానుంది. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో నూతనంగా నిర్మించిన రైల్వే స్టేషన్‌ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. హుబ్లీ డివిజనల్‌ రైల్వే మేనేజరు హర్షకరే రాయదుర్గం రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న పనులను తనిఖీ చేశారు. పనులు మరింత వేగంగా జరగాలని ఆదేశాలు జారీచేశారు. రైల్వే భద్రతపై అధికారులతో చర్చించారు. రైలు ప్రమాదాల నుంచి ఉద్యోగులతోపాటు ఇతర సిబ్బంది కూడా రక్షణ పొందాలని, అందుకు తీసుకోవాల్సిన చర్యలను హర్షకరే తెలియజేశారు.

తిరుపతి రైలును పునరుద్ధరించండి
రైల్వే అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో నైపుణ్యం, భద్రతా చర్యలపై శిక్షణ పొందాలని ఆయన అభిప్రాయపడ్డారు. సేఫ్టీలైన్, విద్యుత్తు సౌకర్యం, సిగ్నలింగ్‌ వ్యవస్థ, మెరుగైన నిర్వహణపై వారందరికీ సూచనలు జారీచేశారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన రైల్వే ప్రమాద ఘటన ఉదహరిస్తూ భద్రతా ప్రమాణాల పెంపుపై ఏమేం చర్యలు చేపట్టాలనేది తెలిపారు. నవంబర్ నుంచి రాయదుర్గం మీదుగా తిరుపతి వెళ్లే రైలు ఆగిపోయిన విషయాన్ని కొందరు ప్రయాణికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దాన్ని పునరుద్ధరించడంతోపాటు మరికొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆపేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు.

anantapur district rayadurgam railway station will open soon

కవచ్ ఏమైందంటున్న ప్రతిపక్షాలు
పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ వద్ద రైలు ప్రమాదం చోటుచేసుకోవడంతో అందుబాటులో ఉన్న కవచ్ వ్యవస్థ ఏమైందని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. ఎదురెదురుగా రెండు రైళ్లు వచ్చినప్పుడు ఢీకొనకుండా ఉండేందుకు భారతీయ రైల్వే కవచ్ పేరుతో అధునాతన వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. అయినప్పటికీ ప్రమాదాలు జరుగుతుండటంపై దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సిగ్నలింగ్ వ్యవస్థను ఇటీవలి కాలం నుంచి భారతీయ రైల్వే ఆధునికీకరిస్తోంది. గతేడాది ఒడిసాలో జరిగిన రైలు ప్రమాదం దగ్గర నుంచి దేశవ్యాప్తంగా ఈ పనిని చేపట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+