నాగబాబుకు పోలీసుల నోటీసులు... హైటెన్షన్!

జనసేన నేత, సినీ నటుడు నాగబాబుకు అనంతపురం జిల్లా పోలీసులు షాకిచ్చారు. ఆయనకు నోటీసులు జారీ చేశారు. జిల్లాలో జరిగే శ్రమదాన కార్యక్రమానికి అనుమతిని నిరాకరించారు. తాము అనుమతివ్వకపోవడంతో పాల్గొనడానికి వీల్లేదంటూ నోటీసులు అందజేశారు. పర్యటన వాయిదా వేసుకోవాలని సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై గుంతలు పూడ్చేందుకు శ్రమదానం చేయాలంటూ జనసేన పిలుపునిచ్చింది. శ్రమదాన కార్యక్రమంలో భాగంగా ఆదివారం అనంతపురం జిల్లాలో జరిగే శ్రమదాన కార్యక్రమంలో నాగబాబు పాల్గొనాల్సి ఉంది. అయితే రాత్రికి రాత్రే చెరువుకట్టలో రోడ్లకు అధికారులు మరమ్మతులు చేయించారు. తర్వాత కార్యక్రమంలో పాల్గొనకుండా నాగబాబుకు నోటీసులు జారీచేశారు.

anantapur police issued notices to janasena nagababu

అనంతపురం పర్యటనను రద్దుచేసుకునే అవకాశమే లేదని, చేపట్టి తీరుతానంటూ నాగబాబు ప్రకటించడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కచ్చితంగా రోడ్లను పరిశీలించేందుకు తాను వెళతానన్నారు. ఈ పరిణామాల మధ్య అనంతపురంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నాగబాబు పాల్గొనాల్సిన ప్రాంతంలో భారీగా పోలీసులను మొహరించారు. నాగబాబుకు ఆహ్వానం పలుకుతూ జనసేన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

పోలీసులు అనుమతి నిరాకరించడంపై జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. జనసేనపై, పవన్ కల్యాణ్ పై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, తమ పార్టీ కార్యక్రమాలను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తోందంటూ ఆరోపించారు. పార్టీ కార్యక్రమాలు చేసుకోవడానికి పోలీసుల నుంచి ఏమైనా ప్రత్యేక అనుమతులు కావాలా? అని ప్రశ్నిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోను కార్యక్రమాన్ని చేపట్టి తీరుతామంటూ ప్రకటించడం, నాగబాబు పర్యటనకు వస్తాననడం, భారీగా మొహరించిన పోలీసుల మధ్య అనంతపురంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+