Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వీడియో: పోలీసులపై బూతులతో రెచ్చిపోయిన టీడీపీ మాజీ ఎంపీ: జేసీ దివాకర్ రెడ్డి దౌర్జన్యం

అనంతపురం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, లోక్‌సభ మాజీ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తనదైన మార్క్‌ను ప్రదర్శించారు. పోలీసులపై రెచ్చిపోయారు. దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆయనను హౌస్ అరెస్ట్ చేయడానికి ప్రయత్నించిన పోలీసులపై జేసీ దివాకర్ రెడ్డి ఉగ్రరూపాన్ని చూపారు. వారిపై శివాలెత్తిపోయారు. ఘర్షణకు దిగారు. ఒకదశలో పోలీసులు, జేసీ దివాకర్ రెడ్డి మధ్య స్వల్పంగా తోపులాట చోటు చేసుకుంది. జూటూరులో జేసీ దివాకర్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో ఈ ఘటన సంభవించింది.

జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సోమవారం తాడిపత్రిలో ఆందోళనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన అనుచరులు తమ ఇంటిపైకి దాడి చేయడాన్ని నిరసిస్తూ వారు తాడిపత్రి తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శనలు, బైఠాయింపులను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు.. జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డిని గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు.

Anantapur: TDP leader JC Diwakar Reddy mishandle the Police in Tadipatri in the district

జేసీ దివాకర్ రెడ్డి జూటూరులోని ఫామ్‌హౌస్‌లో ఉన్న విషయాన్ని తెలుసుకుని డీఎస్పీ శ్రీనివాసులు, పోలీసులు అక్కడికి బయలుదేరారు. ఫామ్‌హౌస్ వద్ద జేసీని హౌస్ అరెస్ట్‌లో తీసుకోబోయారు. బెడ్‌రూమ్‌లో ఉన్న ఆయనను అక్కడే నిర్బంధించడానికి ప్రయత్నించడంతో జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. పోలీసుల వ్యవహరించిన తీరు పట్ల ఆయన మండిపడ్డారు. డీఎస్పీ శ్రీనివాసులుతో వాగ్వివాదానికి దిగారు.

నోటి దురుసుతో తగ్గించుకోవాలని శ్రీనివాసులు జేసీకి సూచించారు. తన ఇంట్లోకి రావడానికి నువ్వెవడివి అంటూ జేసీ తీవ్రస్థాయిలో భగ్గుమన్నారు. దీనితో అక్కడ గందరగోళం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో జేసీ దివాకర్ రెడ్డి అనుచరులు ఆయనను పక్కకు తీసుకెళ్లారు. తనపై పెట్టిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును ఉపసంహరించుకునేంత వరకు తాను నిరసన దీక్ష కొనసాగిస్తానని జేసీ దివాకర్‌ రెడ్డి హెచ్చరించారు. ప్రభాకరెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని వదిలేది లేదని ఆయన అన్నారు.

Recommended Video

    Ap cm ys jagan mohan reddy comments on Hindu Gods issue in Ap state

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+