పెనుకొండలో ఉద్రిక్తత: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీకే మధ్య వాగ్వివాదం
అనంతపురం: రాష్ట్రవ్యాప్తంగా మిగిలిపోయిన 12 మున్సిపాలిటీలు, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ముమ్మరంగా సాగుతోంది. ఈ ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఆ తరువాత కూడా క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తారు అధికారులు. బుధవారం ఓట్లను లెక్కిస్తారు. ఈ 12 మున్సిపాలిటీల జాబితలో కుప్పం కూడా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అందరి చూపూ ఈ మున్సిపాలిటీపైనే నిలిచింది.

12 మున్సిపాలిటీల్లో..
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు బుచ్చిరెడ్డిపాలెం, ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, గురజాల, దాచేపల్లి, దర్శి, కుప్పం, బేతంచెర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాలిటీలకు ఈ ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. వీటితో పాటు ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో 12 డివిజన్లకు పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 353 వార్డులకు నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో 28 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మొత్తంగా 325 వార్డులకు పోలింగ్ నిర్వహిస్తోంది రాష్ట్ర ఎన్నికల కమిషన్.

పెనుకొండలో ఉద్రిక్తత..
అనంతపురం జిల్లా పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 17వ వార్డు పరిధిలో పోలింగ్ సరళిని పర్యవేక్షించడానికి వెళ్లిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన హిందూపురం లోక్‌సభ సభ్యుడు గోరంట్ల మాధవ్‌ను తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకున్నారు. పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లడానికి గోరంట్ల మాధవ్ ప్రయత్నించారని, ఓటర్లను ప్రభావితం చేశారని ఆరోపించారు. దీనితో రెండు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

ఎంపీ గోరంట్ల మాధవ్‌తో బీకే వాగ్వివాదం..
ఈ విషయం తెలిసిన వెంటనే టీడీపీ సీనియర్ నాయకుడు, పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి 17వ వార్డుకు వెళ్లారు. గోరంట్ల మాధవ్‌తో వాగ్వివాదానికి దిగారు. పోలింగ్ కేంద్రానికి ఎందుకు రావాల్సి వచ్చిందని నిలదీశారు. రాతంత్రా డబ్బులు, చీరెలు పంపిణీ చేశారని, పెనుకొండలో తమదే పరిపాలన అని ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకులు భ్రమపడుతున్నారని గోరంట్ల మాధవ్ విమర్శించారు. టీడీపీ నాయకులు ఎంపీ మీదే దౌర్జన్యానికి పాల్పడ్డారని మండిపడ్డారు.

ఎవరు దౌర్జన్యం చేస్తున్నారో తెలుసు..
దీనికి బీకే పార్థసారథి బదులిస్తూ- దౌర్జన్యం ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసునని అన్నారు. ఓటర్లను ప్రలోభానికి గురి చేశారని, ఓడిపోతామని తెలిసే.. పోలింగ్ బూత్‌లను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఎదురుదాడికి దిగారు. దీనితో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఇద్దరినీ శాంతింపజేశారు. ఆ సమయంలో బీకే పార్థసారథి పోలీసులపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. గోరంట్ల మాధవ్‌ను పోలింగ్ కేంద్రానికి ఎలా పంపిస్తారంటూ నిలదీశారు.

ఎంపీకి బుద్ధి లేదు..
ఎంపీకి బుద్ధి లేదని, మీరు ఎలా ఆయనను పోలింగ్ కేంద్రానికి పంపించారని బీకే పార్థసారథి పోలీసులను ప్రశ్నించారు. దీనికి పోలీసులు స్పందించారు. తాము ఆయనను పోలింగ్ కేంద్రానికి వెళ్లకముందే ఆపామని గుర్తు చేశారు. ఆపితే.. ఇక్కడి దాకా ఎలా వచ్చాడని బీకే మళ్లీ పోలీసులను ప్రశ్నించారు. పోలీసులు ఇద్దరినీ సముదాయించి.. వెనక్కి పంపించేశారు. రెండు పార్టీల కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
Recommended Video

ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీడీపీ..
పెనుకొండ మున్సిపల్ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డితో పాటు కాల్వ శ్రీనివాసులు, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యేలు కందికుంట వెంకటప్రసాద్, ఉన్నం హనుమంతరాయ చౌదరి, పరిటాల శ్రీరామ్ తదితరులు పెనుకొండలో మకాం వేశారు. వార్డుల వారీగా ప్రచారం చేశారు. కర్ణాటక నుంచి భారీ ఎత్తున మద్యం తెప్పించారనే ఆరోపణలు ఉన్నాయి.
-
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications