యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు 14 రోజుల రిమాండ్
అమరావతి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యల విషయంలో ప్రముఖ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనను గుంటూరు జిల్లా మంగళగిరిలోని కోర్టు ముందు హాజరుపరిచారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం శ్రీనివారావుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల అనంతరం కొమ్మినేనిని గుంటూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు.
రాజధాని రైతులు, మహిళల ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసు స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. ప్రముఖ టీవీ ఛానల్ లో కొమ్మినేని నిర్వహించిన చర్చా కార్యక్రమంలో కృష్ణంరాజు అమరావతి మహిళలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఆ వ్యాఖ్యలను కొమ్మినేని సమర్థించినట్లు ఆరోపణలు రావడంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కొమ్మినేనితో పాటు మరో జర్నలిస్టు వాడపల్లి కృష్ణంరాజు కూడా నిందితుడిగా ఉన్నారు.

ఇక ఇప్పటికే ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, ఐటీ చట్టం కింద నాన్-బెయిలబుల్ సెక్షన్లలో కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు, సాక్షి యాజమాన్యంపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు సాక్షి యాజమాన్యం, వైసీపీ నేతలు కొమ్మినేని అరెస్టును వ్యతిరేకిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications