యాంకర్ శ్యామల టాలెంటెడ్ అబ్బా.. పోలీసులతో అలా.. బయట ఇలా!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతుంది. ఇటీవల కాలంలో రాష్ట్రంలో ఏ సంఘటన జరిగిన ఆ సంఘటనకు బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనిని వైసిపి ప్రధానంగా టార్గెట్ చేస్తుంది. ఇదే క్రమంలో తాజాగా ఒక కేసులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల పోలీసులు విచారణను ఎదుర్కొన్నారు.
యాంకర్ శ్యామలను విచారించిన పోలీసులు
తాండ్రపాడు గ్రామానికి చెందిన వేణు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటన పైన తప్పుడు ప్రచారం చేశారని మొత్తం 27 మంది పైన కేసు నమోదయింది. ఈ కేసులో యాంకర్ శ్యామల పేరు కూడా ఉంది. దీంతో యాంకర్ శ్యామలను కర్నూలు పోలీసులు విచారించారు.

యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు
బైక్ నడిపిన శివశంకర్ అనే వ్యక్తి బెల్ట్ షాపుల్లో మద్యం తాగినట్టు చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఉన్నాయా అని పోలీసులు ఆమెను ప్రశ్నించారు. కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ కార్యాలయంలో సేవలను డిఎస్పి బాబు ప్రసాద్ విచారణ జరిపారు. పోలీసులు విచారణ తర్వాత శ్యామల మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెప్పానని పేర్కొన్నారు.
మద్యం షాపులపై యాంకర్ శ్యామల ప్రశ్నలు
బస్సు ప్రమాదం పైన ప్రశ్నించినందుకే ప్రభుత్వం తనపై కక్షపూరితంగా కేసు పెట్టిందని యాంకర్ శ్యామల సంచలన ఆరోపణలు చేశారు. తన పైన ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని ఆమె స్పష్టం చేశారు. కూటమి పాలనలో మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారని, హైవేల పైన మద్యం షాపులు ఎందుకు ఏర్పాటు చేశారో చెప్పాలని యాంకర్ శ్యామల ప్రశ్నించారు.
కర్నూలు బస్సు ప్రమాదంపై అడిగితే కేసులా..
కర్నూలు బస్సు ప్రమాదం పైన ప్రశ్నించినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేక తమ పైన అక్రమ కేసులు పెట్టారని యాంకర్ శ్యామల విమర్శించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తితో తాము ఈ ప్రభుత్వం పైన పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పారు.
శ్యామలను పోలీసులు విచారించింది ఇందుకే
ఇదిలా ఉంటే పోలీసులు అడిగిన ప్రశ్నలకు శ్యామల పార్టీ ఆదేశాల మేరకే తాను ఆ వ్యాఖ్యలు చేశానని చెప్పినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చిన శ్యామల మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడారు. కాగా ఇటీవల కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటన పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల బైక్ నడిపిన వ్యక్తి బెల్టు షాపుల్లో మద్యం తాగడం వల్ల ప్రమాదం జరిగిందని, ఈ బెల్ట్ షాపుల పాపం కూటమి ప్రభుత్వానిదేనని టార్గెట్ చేశారు. ఇక ఈ క్రమంలోనే ఆమె పైన కేసు నమోదు చేసి పోలీసులు విచారించారు.
-
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. రామయ్య ఆశీస్సులతో.. -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..!












Click it and Unblock the Notifications