యాంకర్ శివజ్యోతి వీడియో వైరల్.. తిరుమల ప్రసాదంపై కామెంట్స్ !!
యాంకర్ శివ జ్యోతి.. తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు సుపరిచితురాలే. 'తీన్మార్' వార్తల్లో "సావిత్రక్క"గా పాపులర్ అయిన ఆమె.. న్యూస్ ఛానెల్‌లో జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించారు. తెలంగాణ యాసతో ప్రేక్షకులకు చేరువై పలు టీవీ షోలలో యాంకరింగ్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ పాపులారిటీ తోనే బిగ్‌బాస్ సీజన్ 3 లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. దాదాపు 98 రోజులు హౌస్‌లో ఉండి మేల్ కంటస్టెంట్స్ కి కూడా గట్టి పోటీ ఇచ్చింది.
కాగా ఈ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకుల మరింత స్థానం సంపాదించుకుందని చెప్పొచ్చు. బిగ్‌బాస్‌కి ముందు కూడా ఆమె యాంకరుగా ప్రసిద్ధి చెందారు కానీ షో తర్వాత ఆమెకు వచ్చిన గుర్తింపు మరోస్థాయిలో ఉంది. ఈ జోష్‌తో ఆమె ప్రస్తుతం తన సొంత యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తూ.. భర్తతో కలిసి వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే లేటెస్ట్ గా ఆమె చేసిన వీడియో తీవ్ర వివాదాస్పదంగా మారింది.

ప్రపంచంలోనే ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందింది తిరుమల. అయితే ఇటీవల కాలంలో దేవస్థానం పవిత్రతను కాపాడేందుకు టీటీడీ (TTD) ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఆలయ పరిధిలో భక్తులు ఎవరూ రీల్స్ చేయొద్దనే వెల్లడించింది. కానీ కొందరు మాత్రం ఆలయ పవిత్రతను మంటగలిపే విధంగా వ్యవహరిస్తున్నారు. లేటెస్ట్ గా శివజ్యోతి తిరుమల క్యూ లైన్‌లో నిలబడి శ్రీవారి ప్రసాదాన్ని కించపరిచేలా కామెంట్లు చేసింది.
వీడియో వైరల్..
తన భర్త, స్నేహితులతో కలిసి తిరుమలకు వెళ్లిన శివజ్యోతి.. శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్‌లో నిలబడి ఉండగా భక్తుల కోసం సేవకులు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అయితే ఆ ప్రసాదం తీసుకున్న శివజ్యోతి.. ఆమె స్నేహితుడు తిరుమలలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం.. రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం మేమే అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో పట్ల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.
గతంలో సైతం శివజ్యోతి షేర్ చేసిన బాత్‌రూమ్ వీడియోపై వివాదం నెలకొంది. భర్తను ఇంప్రెస్ చేయడం ఎలా అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. శివజ్యోతి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్న 'గంగులు' అనే వ్యక్తిని పెళ్లాడి జీవితాన్ని సాగిస్తున్నారు. గంగులు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా స్థిరపడగా.. ఆయన కూడా శివజ్యోతితో కలిసి టీవీ షోలు, యూట్యూబ్ వీడియోల్లో కనిపిస్తూ గుర్తింపు పొందారు.












Click it and Unblock the Notifications