ఈ 6 జిల్లాల్లో ఆ పార్టీదే ఆధిపత్యం: ఏపీ ఎన్నికలపై లేటెస్ట్ సర్వే రిపోర్ట్
Andhra Assembly elections 2024: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆ దిశగా ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నాలుగు విడతల్లో 68 లోక్‌సభ/అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
నాలుగో విడతలో ఒక లోక్‌సభ, ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఇన్‌ఛార్జీలను నియమించింది వైసీపీ. ఉప ముఖ్యమంత్రి కే నారాయణ స్వామిని చిత్తూరు లోక్‌సభ స్థానానికి ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. ఆయన ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి రెడ్డప్పను అపాయింట్ చేశారు.

Recommended Video

శింగనమల- ఎం వీరాంజనేయులు, తిరువూరు- నల్లగట్ల స్వామిదాస్, మడకశిర- ఈర లక్కప్ప, కొవ్వూరు- తలారి వెంకట్రావ్, కనిగిరి- దద్దాళ నారాయణ యాదవ్, గోపాలపురం- తానేటి వనిత, నందికొట్కూరు- డాక్టర్ సుధీర్ దారా నియమితులయ్యారు.
తెలుగుదేశం పార్టీ- జనసేన తమ అభ్యర్థుల జాబితాలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరువాతే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించింది. షెడ్యూల్ వెలువడటానికి, పోలింగ్ తేదీకి మధ్య సుమారు 40 రోజుల వరకు వ్యవధి ఉంటుందని, జనసేనతో సీట్ల పంపకాల వ్యవహారాన్ని కూడా అప్పుడే తేల్చేయాలని టీడీపీ భావిస్తోంది.
తాజాగా ప్రముఖ సెఫాలజిస్ట్, ఎన్నికల సర్వే సంస్థ చాణక్య ప్రతినిధి పార్థా దాస్.. ఏపీ ఎన్నికలపై సర్వే నిర్వహించారు. వాటి ఫలితాలను వెల్లడించారు. 7,500 మంది ఓటర్ల మనోగతంతో కూడుకున్న సర్వే రిపోర్ట్ ఇది. ఆరు జిల్లాల్లో ఈ సర్వే కొనసాగింది. ఆయా జిల్లాల్లోని 51 నియోజకవర్గాల ఓటర్ల అభిప్రాయాన్ని సేకరించింది.
Samples taken from the following districts (Undivided):
— Partha Das (@partha2019LS) January 18, 2024
1. Srikakulam
2. East Godavari
3. West Godavari
4. Nellore
5. Anantapur
6. Krishna
శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, అనంతపురం, కృష్ణా జిల్లాల్లో ఈ సర్వే చేపట్టారు పార్థా దాస్. ఈ ఆరు జిల్లాలోని 51 నియోజకవర్గాల్లో ఏ పార్టీ మెజారిటీ సాధిస్తుందనే విషయాన్ని వెల్లడించారు. ఇందులో అత్యధిక స్థానాలు అంటే 31 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ఆధిక్యతలో నిలిచింది. మిగిలిన 20 చోట్ల టీడీపీ- జనసేన పైచేయి సాధించింది. ప్రస్తుతానికి బీజేపీని పరిగణనలోకి తీసుకోలేదు.
టీడీపీ- జనసేన అభ్యర్థుల జాబితా వెలువడిన తరువాత మరోసారి ప్రజల మనోగతాన్ని తెలుసుకుంటామని పార్థా దాస్ తెలిపారు. తరువాతి సర్వేల్లో బీజేపీ గురించీ ఓటర్ల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకుంటామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications