పొన్నూరు పోరు టీడీపీకి అగ్నిపరీక్షే
Ponnur Assembly round up: గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం.. ప్రతిపక్ష తెలుగుదేశానికి అగ్నిపరీక్ష పెట్టబోతోంది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోన్న ఈ నియోజకవర్గంలో తిరిగి కైవసం చేసుకోవడం సవాల్‌గా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
గుంటూరు లోక్‌సభ పరిధిలోకి వచ్చే జనరల్ సీటు ఇది. 2,27,727 మంది ఓటర్లు ఉన్నారు. కమ్మ, కాపు బీసీ సామాజిక వర్గం ఓటుబ్యాంకు అధిక సంఖ్యలో ఉంటుందీ నియోజకవర్గం పరిధిలో. ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరగ్గా.. అత్యధికంగా ఏడుసార్లు టీడీపీ ఈ నియోజకవర్గాన్ని గెలుచుకుంది.

కాంగ్రెస్ మూడుసార్లు ఇక్కడ విజయం సాధించింది. సీపీఐ, కాంగ్రెస్ (ఐ), కృషికార్ లోక్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కోసారి చొప్పున ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థి ఒకసారి గెలిచారిక్కడ. 1983లో తెలుగుదేశం ఆవిర్భవించిన తరువాత రెండుసార్లు మాత్రమే ఓడిపోయిందంటే.. పొన్నూరులో ఆ పార్టీ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
1983, 1985 ఎన్నికల్లో టీడీపీ తరఫున ధూలిపాళ్ల వీరయ్య చౌదరి విజయం సాధించారు. 1989లో కాంగ్రెస్ తరఫున చిట్టినేని వెంకట్రావు గెలిచారు. 1994 నుంచి 2019 వరకూ ఓటమి అనేదే తెలియదు టీడీపీకి పొన్నూరు స్థానంలో. ధూలిపాళ్ల నరేంద్ర వరుసగా అయిదుసార్లు విజయఢంకా మోగించారు. నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చారు.

2019లో మాత్రం ఈ కోటను బద్దలు కొట్టింది వైఎస్ఆర్సీపీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనంలో కొట్టుకుపోయింది. వైసీపీ అభ్యర్థిగా తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన కిలారు వెంకట రోశయ్య.. ఈ స్థానంలో జెండా పాతారు. జెయింట్ కిల్లర్‌గా నిలిచారు.
ఈ సారి కిలారు రోశయ్యకు వైఎస్ఆర్సీపీ టికెట్ ఇవ్వలేదు. ఆయనను గుంటూరు లోక్‌సభ అభ్యర్థిగా పంపించింది. పొన్నూరు టికెట్‌ను ప్రముఖ పారిశ్రామికవేత్త అంబటి మురళికృష్ణకు కేటాయించింది. బజరంగ్ అర్బన్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓగా వ్యవహరిస్తోన్నారాయన. కార్పొరేట్ సర్వీస్ కింద అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications