అనుకున్నది సాధిస్తోన్న చంద్రబాబు..!!

Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. పెట్టుబడులపై దృష్టి సారించింది. రాష్ట్రం అన్ని రంగాల్లోనూ సమగ్రంగా అభివృద్ధి చెందడానికి పెట్టుబడులే ప్రధానమని భావిస్తోంది.

ఈ క్రమంలో- మ్యానుఫ్యాక్చరింగ్ సహా అన్ని రంగాల్లో భారీ ఇన్వెస్ట్ మెంట్లను రాబట్టుకోవడానికి చర్యలు చేపట్టింది. అవి సత్ఫలితాలను ఇస్తోన్నాయి. టెక్నాలజీ రంగంలో కార్యకలాపాలను సాగిస్తోన్న ప్రధాన కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తోన్నాయి.

Andhra govt have entered into an MoU with NVIDIA

ఈ క్రమంలో ఎన్ విదియాతో ఏపీ ప్రభుత్వం పరస్పర అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను మరింత ప్రోత్సహించడం, వేల సంఖ్యలో ఉద్యోగాలను కల్పించడంలో భాగంగా ఆ సంస్థతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు చంద్రబాబు తెలిపారు.

దేశంలో ఏపీ విప్లవానికి ఇది నాంది పలుకుతుందని చంద్రబాబు తెలిపారు. ఈ దిశగా తమ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుందని, ఈ రంగానికి చెందిన దిగ్గజ సంస్థలను రాష్ట్రానికి ఆహ్వానిస్తోందని అన్నారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో ఎన్ విదియాతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని చెప్పారు.

రాష్ట్రంలో ఏఐ ఆధారిత పాఠ్యాంశాలను బోధించడానికి, విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ఎన్ విదియా సహరిస్తుందని చంద్రబాబు తెలిపారు. వచ్చే రెండు సంవత్సరాల్లో 10,000 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు దీని ద్వారా నైపుణ్యంలో శిక్షణ పొందుతారని ఆయన వివరించారు.

రాష్ట్రం నుంచి దాదాపుగా 500 ఏఐ స్టార్టప్‌లు ప్రపంచవ్యాప్తంగా తమ కార్యకలాపాలు సాగిస్తోన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, ఆర్ అండ్ డీలో ఎన్ విదియాతో కలిసి దేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్శిటీని స్థాపించడానికి ప్రణాళికలను రూపొందిస్తోన్నామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+