ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
ఏపీ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ ను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవానందరెడ్డి విడుదల చేశారు.
ఏపీ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ ను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవానందరెడ్డి విడుదల చేశారు. 2023 ఏప్రిల్ 3 నుంచి నుంచి 18వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. రెగ్యులర్, ఓరియంటల్, ఒకేషనల్ విద్యార్ధులకు షెడ్యూల్ విడుదలైంది.
2023 ఏప్రిల్ 3వ తేదీ నుంచి పరీక్షలు జరగనున్నాయి.ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.

ఏప్రిల్ 3న గ్రూప్ ఏ విభాగంలో ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష జరుగుతుంది. రెగ్యులర్ విద్యార్ధులకు 10మార్కులకు, ఫస్ట్ లాంగ్వేజ్ కంపోజిట్ కోర్సులకు 70మార్కులకు నిర్వహిస్తారు.
ఏప్రిల్ 6వ తేదీన సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరుగుతుంది. ఏప్రిల్ 8న ఇంగ్లీష్, ఏప్రిల్ 10వ తేదీన లెక్కలు, ఏప్రిల్ 13న సామాన్య శాస్త్రం, ఏప్రిల్ 15న సోషల్ స్టడీస్ పరీక్షలు జరుగుతాయి.
ఏప్రిల్ 17న కంపోజిట్ కోర్సుల్లో ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్ష జరుగుతుంది. ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 11.15 గంటల వరకు 30మార్కులకు ఈ పరీక్ష జరుగుతుంది.
ఓరియంటల్ సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ కోర్సుల్లో భాగంగా ఏప్రిల్ 17న సంస్కృతం, అరబిక్, పర్షియన్ కోర్సుల్లో 100మార్కుల పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరగనుంది.
ఏప్రిల్ 18న ఓరియంటల్ లాంగ్వేజ్ కోర్సుల్లో మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్షను సంస్కృతం, అరబిక్, పర్షియన్ భాషల్లో నిర్వహిస్తారు. ఒకేషనల్ కోర్సుల్లో థియరీ పరీక్షలు కూడా అదే రోజు జరుగుతాయి.
ఎస్సెస్సీ విద్యార్ధులతో పాటు ఓరియంటల్ కోర్సు విద్యార్ధులకు ప్రధాన కోర్సు సబ్జెక్టు పేపర్లు ఒకే విధంగా ఉంటాయని విద్యాశాఖ తెలిపింది. పరీక్షల టైమ్ టేబుల్ ఖరారు చేసిన నేపథ్యంలో పబ్లిక్ సెలవులు, సాధారణ సెలవులు ప్రకటించినప్పటికీ ఆరోజుల్లో పరీక్షలు మాత్రం యథావిధిగా జరగనున్నాయి. సరైన ప్రశ్నాపత్రాలను ఎంచుకోవాల్సిన బాధ్యత విద్యార్థులదే. విద్యార్థులకు పరీక్షా కేంద్రాల మార్పును ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించరు. ఏపీ పదో తరగతి పరీక్షలకు హాజరయ్యేందుకు 6.60లక్షలమంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!











Click it and Unblock the Notifications