ఏపీ ‘పది’ ఫలితాలు విడుదల: తూ.గో ఫస్ట్, చిత్తూరు లాస్ట్, తగ్గిన ఉత్తీర్ణత
ఆంధ్రా విశ్వవిద్యాలయంలో మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు శనివరాం సాయంత్రం 3గంటలకు పదవ తరగతి ఫలితాలను విడుదల చేశారు. పదవ తరగతి 91.92శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు తెలిపారు.
విశాఖపట్నం: ఆంధ్రా విశ్వవిద్యాలయంలో మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు శనివరాం సాయంత్రం 3గంటలకు పదవ తరగతి ఫలితాలను విడుదల చేశారు. పదవ తరగతి 91.92శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు తెలిపారు. ఇది గత సంవత్సరంతో పోల్చితే 2.60శాతం తక్కువని తెలిపారు.
6,22,538 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 5,60,253 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. కాగా, ఫలితాల్లో ఈసారి కూడా అమ్మాయిలే స్వల్ప ఆధిక్యత సాధించారు. బాలుర ఉత్తీర్ణత శాతం 91.87ఉండగా, బాలికల ఉత్తీర్ణత శాతం 91.97శాతం నమోదైనట్లు మంత్రి తెలిపారు.

ఈ ఏడాది ఫలితాల్లో 97.99శాతం ఉత్తీర్ణతతో తూర్పు గోదావరి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని మంత్రి తెలిపారు. చివరి స్థానంలో 80.55శాతం ఉత్తీర్ణతతో చిత్తూరు జిల్లా నిలిచిందని చెప్పారు. గత మూడు సంవత్సరాల నుంచి చిత్తూరు చివరి స్థానంలోనే ఉందన్నారు.
2ప్రైవేటు పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైందని గంటా తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం 84.89గా నమోదైందని ఆయన తెలిపారు. జీపీఏ సాధించిన విద్యార్థులు 18,225మంది ఉన్నారని చెప్పారు.
2ప్రైవేటు పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైందని గంటా తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం 84.89గా నమోదైందని ఆయన తెలిపారు. జీపీఏ సాధించిన విద్యార్థులు 18,225మంది ఉన్నారని చెప్పారు. జూన్ 14 నుంచి పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పాత పద్ధతిలో పరీక్ష రాసేవారికి ఇదే చివరి అవకాశమని తేల్చి చెప్పరు. పది ఫలితాల పాస్ వర్డ్ APSSC@2017.












Click it and Unblock the Notifications