ఏపీలో లగడపాటి మినహా జగన్‌కు జై కొట్టిన లోకల్ సర్వే! నువ్వానేనా అంటున్న జాతీయ ఛానల్స్ !

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు 2019కి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాసేపట్లో వెలువడుతాయి. లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడనున్నాయి. ఏప్రిల్ 11న తొలి విడతలోనే ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దాదాపు నెలనర్రకు పైగా అక్కడి ఓటర్లు ఇచ్చిన తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. అయితే ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

Andhra Pradesh Assembly Elections 2019 exit polls live updates

May 19, 2019, 7:49 pm IST

ఏపీ 'సీపీఎస్' ఎగ్జిట్ పోల్ ఫలితాలు అసెంబ్లీ : వైసీపీ 130-133 ; టీడీపీ 43-44 ; జనసేన 0-1
May 19, 2019, 7:40 pm IST

ఏపీ 'వీడీపీఏ అసోసియేట్స్' ఎగ్జిట్ పోల్ ఫలితాలు : అసెంబ్లీ : వైసీపీ 111 - 121; టీడీపీ 54 - 60; జనసేన 0-4 .. లోక్ సభ : టీడీపీ 4; వైసీపీ 21; జనసేన 00
May 19, 2019, 7:36 pm IST

ఏపీ 'ఐఎన్‌ఎస్ఎస్' ఎగ్జిట్ పోల్ ఫలితాలు అసెంబ్లీ : టీడీపీ 118 ; వైసీపీ 52 ; జనసేన 5 .. పార్లమెంట్ : టీడీపీ 17 ; వైసీపీ 7 ; జనసేన 1
May 19, 2019, 7:29 pm IST

ఏపీ 'ఐ న్యూస్' ఎగ్జిట్ పోల్ ఫలితాలు అసెంబ్లీ : వైసీపి 110-120 ; టీడీపీ 55-62 ; జనసేన 0-3... పార్లమెంట్ : వైసీపీ 19-21 ; టీడీపీ 4-6 ; జనసేన 00
May 19, 2019, 7:18 pm IST

ఏపీలో ఆరా ఎగ్జిట్ పోల్ ఫలితాలు అసెంబ్లీ : వైసీపీ 120 - 125; టీడీపీ 50 - 55; జనసేన : 00 పార్లమెంట్ స్థానాలు: వైసీపీ : 20-24; టీడీపీ : 1-5; జనసేన: 00
May 19, 2019, 7:15 pm IST

ఏపీ లోక్‌సభ ఎగ్జిట్ పోల్ ఫలితాలు మిషన్ చాణక్యా : వైసీపీ 15±1, టీడీపీ 8±1, జనసేన 0±1
May 19, 2019, 7:07 pm IST

ఏపీ అసేంబ్లీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు మిషన్ చాణక్యా : వైసీపీ 97±7 , టీడీపీ 58±3, జనసేన 7±2, బీజేపీ 0±1, కాంగ్రెస్ 0±0
May 19, 2019, 7:01 pm IST

ఆర్‌జీ ఫ్లాష్ టీం : పార్లమెంట్ సీట్లు.. టీడీపీకి 15±2, వైసీపీ 10±2, ఇతరులకు 0±1
May 19, 2019, 6:57 pm IST

ఆర్‌జీ ఫ్లాష్ టీం : ఓటింగ్ శాతాలు టీడీపీకి 43% ± 1%, వైసీపీ 41% ± 1% , జనసేన 11% ± 1%
May 19, 2019, 6:52 pm IST

ఆర్‌జీ ఫ్లాష్‌ టీం : టీడీపీకి 100 ± 10, వైసీపీ 72 ± 7, ఇతరులు 3 ± 2
May 19, 2019, 6:46 pm IST

ఏపీలో వైసీపీ గట్టి పోటీ ఇచ్చింది. దాదాపు టీడీపీకి దగ్గరగా నిలబడింది. కాని అధికారంలోకి రాదు.
May 19, 2019, 6:45 pm IST

తెలుగుదేశం పార్టీ మరో సారి అధికారంలోకి రాబోతోందని ఆర్‌జీ ఫ్లాష్ టీం సర్వేలో తేలింది.
May 19, 2019, 6:43 pm IST

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల మీద ప్రజలకు ఆసక్తి ఎక్కువగా ఉంది
May 19, 2019, 6:42 pm IST

తెలంగాణలో టీఆర్ఎస్‌కు 14-16 వరకు , కాంగ్రెస్‌కు 0-2, బీజేపీ 0-1 వచ్చే అవకాశం ఉంది ఎంఐఎం ఒక స్థానంలో గెలుస్తుంది.
May 19, 2019, 6:40 pm IST

ఆర్‌జీ ఫ్లాష్ టీం రాజకీయాలకు అతీతంగా ఎగ్జిట్ పోల్ సర్వే చేసింది : లగడపాటి
May 19, 2019, 6:32 pm IST

తిరుపతి : ఫార్చూన్ హోటల్‌లో మాట్లాడుతున్న లగడపాటి రాజగోపాల్
May 19, 2019, 6:28 pm IST

ఎన్నికల నిబంధనలతో తేరుకున్న ఓ ఛానల్.. ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిలిపివేత. 6.30గంటలకు ఇస్తామని ప్రకటన
May 19, 2019, 6:21 pm IST

సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడానికి అనుమతి లేదన్న ఈసీ. సాయంత్రం 6గంటలకే ఫలితాలు ప్రకటించిన ఛానల్స్
May 19, 2019, 6:20 pm IST

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన పలు తెలుగు టీవీ చానల్స్
May 19, 2019, 6:18 pm IST

ఫలితాలు ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నా ఆర్‌జీ ఫ్లాష్ టీం, మిషన్ చాణక్యా, ఐఎన్‌ఎస్‌ఎస్, సీపీఎస్ లాంటి సంస్థలతోపాటు పలు ఛానల్స్
May 19, 2019, 6:07 pm IST

మరికాసేపట్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల
May 19, 2019, 5:57 pm IST

దేశవ్యాప్తంగా ముగిసిన సార్వత్రిక ఎన్నికలు
May 19, 2019, 3:44 pm IST

సాయంత్రం 6 గంటలకు చివరి విడత పోలింగ్ ముగియగానే సాయంత్రం 6:30 గంటలకు ఎగ్జిట్ ఫలితాలు విడుదల కానున్నాయి.
May 19, 2019, 3:44 pm IST

ఇక ఆదివారం లగడపాటి జోస్యం ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
May 19, 2019, 3:44 pm IST

ఏపీలో పోటీ ప్రధానంగా అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ, జనసేనల మధ్యే జరిగింది. దీనికి తోడు శనివారం లగడపాటి తన అంచనాను పరోక్షంగా చెప్పారు. ఏపీలో సైకిల్‌దే హవా అంటూ చిన్న హింట్ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+