చంద్రబాబు ఏరియల్ సర్వే, మోదీకి నివేదిక, విజయవాడలో సీన్ రిపీట్ కానివ్వం
విజయవాడ తో పాటు గన్నవరం నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాల్లో బుడమేరు ముప్పు ప్రభావిత ప్రాంతాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని సంబంధిత అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యల్లో నిర్లక్షం వహిస్తే సహించేదిలేదని సీఎం చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులను హెచ్చరించారు.
గంటలను వేగంగా పూడ్చాలని, సహాయక చర్యలు వేగం పెంచాలని సీఎం చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే నిర్వహించారు. బుడమేరు ప్రవాహాలు, గుండ్లు పడిన ప్రాంతాలను, ముందు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్న కృష్ణానది ప్రవాహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు.

విజయవాడ నగరంతో పాటు గన్నవరం నియోజకవర్గంలో పరిధిలోని గ్రామాల్లో సాధారణ స్థితికి తీసుకురావడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు నిర్మాణానికి అనుమతి ఇవ్వడం వలనే ఈరోజు ఈ పరిస్థితి ఎదురైయ్యిందని సీఎం చంద్రబాబు నాయుడు ఓ అంచనాకు వచ్చారని తెలిసింది.
భవిష్యత్తులో ఇంత కంటే ఎక్కువ వరద నీరు వచ్చినా విజయవాడలోకి ఆ నీరు ప్రవేశించకుండా అదునీకరణ పనులు చేపట్టడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అక్రమణల తొలగింపుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బుడమేరు నీరును విజయవాడ నగరంలోకి రాకుండా కృష్ణా, కొల్లేరులో కలిసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.
కొల్లేరు అక్రమాల పైన దృష్టి సారిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అంటున్నారు నగర శివారులో ప్రాంతాల్లో నిర్వహణ సక్రమంగా ఉంటే విజయవాడ నగరంలోకి ఇంత పెద్ద స్థాయిలో నీరు వచ్చేది కాదని, ఆదిశగా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటూ సంబంధిత అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రైతులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు పంటలు దెబ్బతిన్న వివరాలను తెలుసుకున్నారు. ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు వరదల్లో ఎంత నష్టం జరిగింది అంటూ ఓ అంచనాకు వచ్చారని తెలిసింది.

సంబంధిత అధికారులతో చర్చలు జరిపి వరదల వరదల కారణంగా ఎంత నష్టం జరిగిందో అంటూ ఓ నివేదిక తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడానికి చంద్రబాబు సిద్ధం అయ్యారని తెలిసింది. ఇప్పటికే కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విజయవాడ లో పర్యటించి వరదల కరణంగా ఎంత నష్టం జరిగింది అంటూ ఓ అంచనాకు వచ్చారు. రైతులు, వరద బాదిత ప్రాంతాల్లోని స్థానికులతో మాట్లాడిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరద బాధితులకు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు
ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించి వెంటనే నిధులు విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వానికి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. చంద్రబాబు ఏరియల్ సర్వే కూడా పూర్తి చేయడంతో ఆంధ్రప్రదేశ్ కు త్వరలో నిధులు మంజూరు అవుతాయని విజయవాడ నగర ప్రజలను ఆదుకోవడానికి కేంద్రం సహకరిస్తుందని టీడీపీ నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications