ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటనలు...షురూ:షెడ్యూల్ విడుదల
విజయవాడ:జూన్ 2 వ తేదీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా విడుదల చేశారు.ఈ పర్యటనలో
చంద్రబాబు
నవ నిర్మాణదీక్ష, మహాసంకల్పం, గ్రామదర్శిని, గ్రామ సభలు వంటి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.కేవలం పాల్గోవడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల అమలు తీరు కూడా క్షేత్ర స్థాయిలో స్వయంగా పర్యవేక్షిస్తారని తెలిసింది. అలాగేగ్రామసభలలో జరిగిన అభివృద్ధిపై నివేదిక, భవిష్యత్ లక్ష్యాల సాధన తదిదర విషయాలపై దిశానిర్దేశం చేస్తారని సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనల షెడ్యూల్ వివరాలు ఇవి....

2వ తేదీ: విజయవాడ బెంజ్ సర్కిల్‌లో నవ నిర్మాణ దీక్ష
3 వ తేదీ : కర్నూలు జిల్లా
4వ తేదీ: విజయనగరం జిల్లా
5వ తేదీ: తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం
6వ తేదీ: కడప జిల్లా
7వ తేదీ: చిత్తూరు జిల్లా
8వ తేదీ: నెల్లూరు నగరంలో మహా సంకల్పం బహిరంగ సభ












Click it and Unblock the Notifications