ఎలాంటి భయమొద్దు, విభజన జరిగిపోయింది: దానం

ఈ సందర్భంగా దానం, ముఖేష్ మాట్లాడారు. హైదరాబాదును జిహెచ్ఎంసి పరిధిలో ఉమ్మడి రాజధాని చేయడం సరికాదన్నారు. రెవెన్యూ పరిధి మేరకే ఉమ్మడి చేయాలన్నారు. ఉమ్మడి రాజధాని పైన తాము అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పారు.
హైదరాబాదు శాంతిభద్రతల సమస్యలను గవర్నర్‌కు ఇవ్వడం సరికాదని, దీని పైనా తము చర్చిస్తామన్నారు. గవర్నర్ పరిధిలో శాంతిభద్రతల సమస్యలు ఉంటే అనేక సమస్యలు వస్తాయన్నారు.
ఒత్తిడి లేదు: మల్లుభట్టి
సభాపతులు రాజ్యాంగబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటారని డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క వేరుగా అన్నారు. కావాల్సిన సమాచారం అడిగితే సభాపతులు ఇస్తారన్నారు. ఎలాంటి ప్రలోభాలకు, భావోద్వేగాలకు తాము లోనుకావడం లేదన్నారు. సభా స్థానాన్ని కించపర్చవద్దన్నారు. బిఎసి ప్రకారం చర్చ మొదలైందా లేదా అన్నది అప్రస్తుతమన్నారు.
సీమాంధ్రలో బిజెపి ఆందోళనలు
తెలంగాణ ముసాయిదా బిల్లు పైన సీమాంధ్రలో భారతీయ జనతా పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అనంతపురం, తూర్పు గోదావరి తదితర జిల్లాల్లో బిజెపి ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
అనంతపురంలో కేంద్రమంత్రుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జిల్లాలోని పలు చోట్ల ముసాయిదా బిల్లు ప్రతులను చించివేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో దేవీ చౌక్ సెంటర్ వద్ద ఆందోళన చేశారు.












Click it and Unblock the Notifications