తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికి శుభవార్తను చెప్పిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుభవార్తను చెప్పారు. ఈ నెల నుంచి వారికి రేషన్ లో బియ్యంతోపాటు కందిపప్పు, పంచదార కూడా అందజేయనున్నారు. విజయ దశమి నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తారు. రూ.67కు కిలో కందిపప్పుడు, రూ.17కు అరకిలో పంచదార అందజేస్తారు. త్వరలోనే రేషన్ డీలర్ల సంఖ్యను కూడా ప్రభుత్వం పెంచబోతోంది. ప్రస్తుతం ఇంటింటికీ తిరిగి రేషన్ అందజేస్తున్న వాహనాలపై ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.

ధరలకు అడ్డుకట్ట వేసేలా
ప్రస్తుతం బియ్యంతోపాటు కందిపప్పు, పంచదార ఇస్తున్నామని, వచ్చే ఏడాది జనవరి నుంచి తృణధాన్యాలు కూడా ఇవ్వనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. రాయితీపై అందిస్తున్న కందిపప్పు, పంచదారను ఆయన తెనాలిలో ప్రారంభించారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా లక్షన్నర కుటుంబాలకు మేలు కలుగుతుందన్నారు. త్వరలోనే నూనె, గోధుమపిండి తదితర నిత్యావసరాలను కూడా అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. బహిరంగ మార్కెట్ లో నిత్యావసరాల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని, అలా ధరలు పెరగకుండా అడ్డుకట్ట వేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు.

andhra pradesh government giving dal and sugar to those who have white ration card

2019 వరకు కిలో రూ.40కి ఇచ్చేవారు
గత చంద్రబాబు ప్రభుత్వంలో 2019 వరకు రాయితీపై కిలో రూ.40 చొప్పున రెండు కిలోల కందిపప్పు ఇచ్చేవారు. వైసీపీ వచ్చిన తర్వాత కిలో ఇవ్వడం ప్రారంభించింది. ధరను కూడా 67కు పెంచారు. సరుకుల పంపిణీలో కొన్ని లోపాలు ఉండటంతో వీటిని నిలిపివేశామని, దసరా, దీపావళి పండుగలు ఉండటంతో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయని, వాటిని నియంత్రించేందుకు వీటిని పంపిణీ చేస్తున్న మంత్రి మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో 4.30 కోట్ల మందికి దీనిద్వారా లబ్ధి కలగనుంది. రేషన్ సరుకులను పంపిణీ చేసే వాహనాలకు ఇంతవరకు ప్రభుత్వం డబ్బులు కూడా చెల్లించలేదని, దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+