ఇక నుంచి అన్నిసర్టిఫికెట్లు వాట్సప్‌లోనే.. మెటాతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం
ఫేస్‌బుక్ మాతృసంస్థ అయిన మెటాతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. మెటాతో కలిసి ప్రజలకు సేవలందించేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అయింది. ఈ మేరకు మెటాతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి నారా లోకేష్ మెటా సంస్థ ప్రతినిధులు ఢిల్లీలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. మంత్రి నారా లోకేశ్ చొరవతో ప్రజలకు ప్రభుత్వం నుంచి పౌరసేవలు వాట్సాప్ బిజినెస్ ద్వారా అందించేందుకు మెటా అంగీకరించింది. మెటా ఫ్లాట్ ఫాం వాట్సాప్ బిజినెస్ ద్వారా ఇకపై క్యాస్ట్, ఇతరత్రా సర్టిఫికెట్లు వేగంగా, సులభంగా పొందేందుకు వీలవుతుంది. అలాగే నకిలీలు, ట్యాంపరింగ్ అవకాశం లేకుండా పారదర్శకంగా ఆన్‌లైన్‌లోనే సర్టిఫికెట్ల జారీ ఉంటుంది.

మెటా నుంచి కన్సల్టేషన్ టెక్నికల్ సపోర్ట్, ఈ గవర్నెన్స్ అమలు, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా మరిన్ని పౌర సేవలు ఏపీ ప్రభుత్వానికి అందించేలా మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో ఏపీ అధికారులు, మెటా ప్రతినిధులు ఢిల్లీ లోని 1 జన్ పథ్ లో జరిగిన కార్యక్రమంలో ఎంవోయూ (ఒప్పందం) చేసుకున్నారు. టెక్నికల్ సపోర్ట్, ఈ గవర్నెన్స్, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా మరిన్ని సిటిజెన్ సర్వీసెస్ ఏపీ ప్రభుత్వానికి మెటా అందించనుంది. ఈ విషయాన్ని నారా లోకేష్ తన సోషల్ మీడియా వేదికైన 'ఎక్స్(X)'లో తెలిపారు. మెటాతో ఎంవోయూ ఒక చారిత్రాత్మకమైన మైలురాయి అని మంత్రి లోకేశ్ అభివర్ణించారు. త్వరలోనే మెటా టెక్నాలజీ ద్వారా పౌర సేవలను ప్రజలకు ఒక్క క్లిక్ ద్వారా సమర్ధవంతంగా అందజేస్తామని ట్వీట్ చేశారు.
I’m delighted to announce a landmark cooperation between the Government of AP and Meta to enable citizen-centric public services through WhatsApp. This collaboration will soon efficiently deliver public services through Meta’s innovative technology, and ensure that our… pic.twitter.com/SZurDDfP08
— Lokesh Nara (@naralokesh) October 22, 2024












Click it and Unblock the Notifications