విధులకు గైర్హాజరు: ఏపీలో 640 మంది వైద్యులకు షోకాజ్ నోటీసులు

అమరావతి: ఏపీలో విధులకు గైర్హాజరవుతున్న వైద్యులపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాలోని 640 మంది ప్రభుత్వ వైద్యులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో ప్రాథమి, ఏరియా ఆసుపత్రుల్లో వైద్యుల గైర్హాజరు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది.

దీంతో సమయపాలన పాటించిన వైద్యులకు ఏపీ ప్రభుత్వం షోకాజ్ నోటీసుతో పాటు ఛార్జీ మెమోను సైతం జారీ చేసింది. డీఎంఈలో 240, ఏపీవీవీపీలో 190, డీఎంహెచ్ లో 210 మంది ఈ నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. నోటీసులు అందుకున్న వైద్యులు సుమారు 3 నెలలకు పైబడి విధులకు గైర్హాజరవుతున్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది.

విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగానే వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అంగీకరించారు. వీరి గైర్హాజరుతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రూ.150కోట్ల విలువైన వైద్య పరీక్షల పరికరాలు నిరుపయోగంగా ఉన్నాయని మంత్రి తెలిపారు.

Andhra Pradesh Government Issues Show Cause Notice to 640 Doctors

నోటీసులు అందుకున్న వైద్యుల్లో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ, ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారనే ఆరోపణలు వచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే నోటీసులు అందుకున్న వైద్యులు మాత్రం వాటిని ఖండిస్తున్నారు. తమ నుంచి ఎటువంటి వివరణ కోరకుండా, నోటీసులు ఎలా ఇస్తారని వైద్యశాఖ ఉన్నతాధికారితో భేటీలో వీరు అభ్యంతరం తెలిపారు.

సంఘం డెయిరీ మాజీ డైరెక్టర్ ఇంట్లో ఐటీ సోదాలు

సంఘం పాల డెయిరీ మాజీ డైరెక్టర్, టీడీపీ నాయకుడు కుర్రా వీరయ్య ఇంట్లో బుధవారం ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండల కేంద్రంలోని విద్యానగర్‌లో ఉన్న ఆయన నివాసంలో తనిఖీలు చేసిన ఐటీ అధికారులు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+