నాపై పెట్టిన కేసులను నిరూపించండి... నాకు నేనే శిక్ష వేసుకుంటా.... చింతమనేని

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగపరుస్తుందని జైలునుండి విడుదలైన దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఆ చట్టాన్ని ఉపయోగించి ప్రతిపక్ష పార్టీని భూస్థాపితం చేయాలని కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. తనపై 18 కేసులు పెట్టి అన్యాయంగా జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను దళిత వ్యతిరేకిని అని నిరూపిస్తే... రాజకీయాల నుండి శాశ్వత తప్పుకుంటానని సవాల్ విసిరారు.

సీఎం అహంభావంతో వ్యవహరిస్తున్నాడు.

సీఎం అహంభావంతో వ్యవహరిస్తున్నాడు.

ఎస్సీఎస్టీ కేసులో 66 రోజుల పాటు రిమాండ్‌లో ఉన్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కండిషనల్ బెయిల్ పై విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సంధర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. జైలు జీవీతంపై వివరించిన చింతమనేని, అనవసర ఆరోపణలతో జైలు పాలు చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తాను చేసిన తప్పు ఏమిటో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వమే స్యయంగా తనపై ఉన్న కేసులపై విచారణ జరపాలని సీఎం జగన్ మోహన్ రెడ్డిని కోరుతున్నానని అన్నారు. తనపై కేసులను నిరూపిస్తే... తనకు తానే శిక్ష వేసుకుంటానని అన్నారు.

హత్యలు, అత్యాచారాలు చేసినవారు నా కంటే ముందు వెళ్లారు

హత్యలు, అత్యాచారాలు చేసినవారు నా కంటే ముందు వెళ్లారు

ఏలూరు జిల్లా జైలులో 66 రోజుల పాటు ఉన్న చింతమనేని భావోద్వేగానికి గురయ్యారు. తనతో పాటు జైలులో ఉన్న నేరస్తులు తన కళ్లముందే బయటకు వెళ్లారని అన్నారు. వారిలో హత్యలు చేసినవారు, అత్యాచారాలు చేసినవారు కూడ ఉన్నారని చెప్పారు. జైలు జీవితంపై చంద్రబాబుకు తెలియకపోవచ్చు గాని , అన్యాయంగా జైలు జీవితం గడపడం అది ఎంత కష్టమో సీఎం జగన్ మోహన్ రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు.

నాపై 13 ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసులు

నాపై 13 ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసులు

డాక్టర్ బాబా సాహేబ్ ఎస్సీల హక్కులను కాపాడేందుకు చట్టాన్ని రూపోందిస్తే ఆ చట్టాన్ని దుర్వినియోగం చేసి , ఒక రాజకీయ పార్టీని భూస్థాపితం చేసేందుకు ఉపయోగించుకుంటున్నారని అన్నారు. తనపై 13 ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కేసులు పెట్టారని అన్నారు. కేసులపై నిలదీస్తే.... అవన్ని చంద్రబాబు నాయుడు పెట్టిన కేసులని అంటున్నారని చెప్పారు... తాను ఎవరి ఆస్తిని గుంజుకున్నానని కేసులు పెట్టారని ప్రశ్నించారు. నిజంగా తాను తప్పులు చేస్తే రోజుకో స్టోరీలాగా ప్రజలకు చూపించండి అంటూ మీడీయాను కోరాడు.

మంచి ముఖ్యమంత్రి అంటే...

మంచి ముఖ్యమంత్రి అంటే...

ఆరునెలల్లో మంచి ముఖ్యమంత్రిగా అవుతున్నానని చెప్పిన సీఎం జగన్ మొహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం ద్వార మంచి ముఖ్యమంత్రి కాలేరని అన్నారు. శాంతి భద్రతలను కాపాడడంతో పాటు ఎవరి మనసులను గాయపెట్టకుండా ఉండడమే మంచి ముఖ్యమంత్రి లక్షణమని ముఖ్యమంత్రికి తెలియదా అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే తనపై పెట్టిన కేసుల్లోని తప్పులను నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామాల్లో తాను దళిత వ్యతిరేకినని ఎవరైనా చెప్పినా...నాకు నేనే రాజకీయాల నుండి తప్పుకుని శిక్ష వేసుకుంటానని అన్నారు. ఎవరిదైనా అస్తి కాజేశాని నిరూపిస్తే... అక్కడే ఆ ఆస్తిని తిరిగి రాసిస్తానని అన్నారు. తాను ఏ తప్పులు చేయకపోయినా కేసులు పెట్టడడమేనా... ప్రజా స్వామ్యామా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+