తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికి శుభవార్తను చెప్పిన సీఎం చంద్రబాబు

బహిరంగ మార్కెట్ లో నిత్యావసరాల ధరలు పెరుగుతుండటంతో వీటిని నియంత్రించేందుకు కొన్ని వస్తువులను రేషన్ షాపులద్వారా సరఫరా చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా రాయితీ ధరలపై పంచదార, గోధుమపిండి, కందిపప్పును సరఫరా చేయబోతున్నారు. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పౌరసరఫరాలశాఖను ఆదేశించారు. అంతేకాకుండా రాబోయే మూడు నెలలవరకు (అక్టోబరు) సరిపోయేలా నిత్యావసరాలను పంపిణీ చేయాలని సూచించారు.

టెండర్లను పిలిచిన సివిల్ సప్లైస్
పౌరసరఫరాల శాఖ కాంట్రాక్టర్ల నుంచి టెండర్లను ఆహ్వానించింది. బియ్యంతోపాటు గోధుమపిండి, పంచదార, కందిపప్పు సరఫరా కోసం టెండర్లను పిలవగా కాంట్రాక్టర్లు పంచదారపై ఎక్కువ ధరను కోట్ చేయడంతో మంత్రి నాదెండ్ల మనోహర్ వీటిని రద్దు చేసి కొత్తగా టెండర్లను మళ్లీ పిలిచారు. 22,500 టన్నుల కందిపప్పుడు, 17,538 టన్నుల పంచదార సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రొక్యూర్ మెంట్ ద్వారా ఈవారంలో వీటిని అధికారులు పూర్తిచేయబోతున్నారు.

andhra pradesh government to distribute essentials to ration card holders from next month

నాణ్యత తగ్గితే కఠిన చర్యలు
ఆగస్టు నుంచి రేషన్ కార్డు ఉన్నవారికి రాయితీపై 67 రూపాయలకే కేజీ కందిపప్పును అందివ్వబోతున్నారు. దీంతోపాటు అరకిలో పంచదార కూడా ఇస్తారు. నిత్యావసర వస్తువులను ఇచ్చేటప్పుడు తూకంలో తేడాలు రావడంతో ప్రస్తుతం రేషన్ వస్తువులను ఇవ్వడం ప్రభుత్వం నిలిపివేసింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే పౌరసరఫరాలశాఖపై ప్రత్యేక దృష్టి సారించింద. మంత్రి మనోహర్ రాష్ట్రవ్యాప్తంగా విస్త్రంగా తనిఖీలు నిర్వహించారు. సమస్యలన్నింటినీ పరిష్కరించి వచ్చే నెల నుంచి సరుకులను ప్రజలకు అందివ్వబోతున్నారు. పంపిణీ చేసే వస్తువుల నాణ్యతలో తేడాలుండటం, నాణ్యత తగ్గడంలాంటివి జరిగితే కాంట్రాక్టర్లతోపాటు అధికారులపై కూడా కఠిన చర్యలుంటాయని మంత్రి మనోహర్ హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+