కొత్తగా చంద్రబాబు ఒకటే పథకం... 7 ప్రయోజనాలు!

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సారథ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఇటీవలే తొలిసారిగా కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహించింది. భవిష్యత్తులో తాను అవలంబించబోతున్న విధానాలు, సంక్షేమం కోసం అమలు చేయాలనుకుంటున్న పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. వాటిని ప్రజలకు చేరువయ్యేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని, ఈ విషయంలో అలసత్వానికి తావులేదని స్పష్టం చేశారు. ఒకటే పథకంద్వారా ప్రజలకు ఎన్నిరకాలుగా ప్రయోజనాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం.

ప్రతి నెలా ఒకటో తేదీన పేదల సేవలో
సెప్టెంబరు ఒకటోతేదీ నుంచి పేదల సేవలో పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ప్రతి నెలా ఒకటోతేదీన ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రజలవద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకుంటారు. సాధ్యమైనంతవరకు కొన్నింటిని అక్కడికక్కడే అధికారులద్వారా పరిష్కరింపచేస్తారు. తర్వాత తాను ఎన్నికల హామీలో ఇచ్చిన ఉద్యోగాల కల్పనను సాధ్యమైనంత వేగంగా అమలు చేయాలన్న ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నారు.

Andhra Pradesh government will implement seven benefits through the new scheme

స్కిల్ డెవలప్ మెంట్ అంశాన్ని కలెక్టర్ల సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభించి యువతకు ఉద్యోగాలను ఇచ్చేదిశగా అడుగులు వేయబోతున్నారు. 2047కల్లా దేశంలో పెరుగుతున్న వృద్ధ జనాభాను దృష్టిలో ఉంచుకొని వారికి అనుగుణంగా కొత్త పథకాలను, వారి అవసరాలను తీర్చేలా ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.

త్వరలోనే ఆకస్మిక తనిఖీలు
ప్రతి జిల్లాల్లో విండ్ టర్బైన్లు ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే సోలార్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించి వారిని సోలార్ విద్యుత్తుదిశగా అడుగులు వేయించబోతున్నారు. ప్రతి ఇంటిపై సోలాన్ ప్యానెళ్లు ఏర్పాటు చేయించి, వాటినుంచి విద్యుత్తును కొనుగోలు చేస్తారు. ప్రతిపక్షాలు చేసే ఆరోపణలపై కఠినంగా వ్యవహరించబోతున్నారు. చేసే ఆరోపణకు కచ్చితంగా సాక్ష్యాలుండాలి. గంజాయి విషయంలో ఉక్కుపాదం మోపుతున్నారు.

పరిపాలనపై పూర్తిస్థాయిలో పట్టు ఉండేలా అధికారులు, ప్రజాప్రతినిధులకు కలిపి ఓ యాప్ అందుబాటులోకి తెస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలోనే ఆకస్మిక తనిఖీలు చేయబోతున్నారు. దీనిద్వారా అధికారులు అప్రమత్తంగా ఉంటారనేది ఆయన ఉద్దేశంగా ఉంది. చెత్తను పొలాలకు ఎరువుగా ఉపయోగించే అంశంతోపాటు దాన్ని రీసైక్లింగ్ చేసి డబ్బులు సంపాదించేలా చూడబోతున్నారు. అధికారులు క్రియేటివ్ గా ఆలోచించి ప్రజలకు మెరుగైన పాలన అందించాలని చంద్రబాబు కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+