ఏపీలో మహిళలకు మరో పథకాన్ని ప్రారంభిస్తున్న చంద్రబాబు

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపచేయాలని, సంపదను సృష్టించాలంటూ తరుచుగా చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాత్రం అభివృద్ధితోపాటు సంక్షేమానికి కూడా సమాన ప్రాధాన్యతనిస్తున్నారు. గత పది సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు ప్రజలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. దీంతో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సంక్షేమ పథకాలను కొనసాగించక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ఏపీలో పలు పథకాలను ప్రవేశపెడుతున్న ఎన్డీయే కూటమి ప్రభుత్వం తాజాగా మహిళలకు మరో పథకాన్ని తీసుకొచ్చింది.

ఉత్తమమైన విధానాన్ని ప్రవేశపెట్టాలి
వైద్య, ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 2014-19 మధ్య కాలంలో తమ ప్రభుత్వం అమలు చేసిన ఉత్తమమైన విధానాలను తిరిగి ప్రవేశపెట్టాలన్నారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కు కొన్ని సూచనలు చేశారు. ఎన్టీఆర్ బేబీ కిట్లను తల్లులకు అందించాలని చంద్రబాబు ఆదేశాలు జారీచేశారు.

Andhra Pradesh government will implement the ntr baby kits scheme details here

2016లో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీఆర్ బేబీ కిట్లను ప్రారంభించిందని, మహిళలు ప్రసవమైన తర్వాత పుట్టిన పిల్లలకు ఎటువంటి ఇన్ ఫెక్షన్ సోకుండా ఉండేందుకు బేబీకిట్లను అందజేసింది. ఇందులో చేతులు శుభ్రం చేసుకునే లిక్విడ్, దోమతెర గొడుగు, న్యాప్ కిన్లు, చిన్న పరుపు, బేబీ సోప్ ను కిట్ల రూపంలో బాలింతలకు అందించేవారు. వైసీపీ కొన్నాళ్లు అమలుచేసి ఈ పథకానికి తర్వాత స్వస్తి చెప్పింది.

తానే నేరుగా సందర్శిస్తా
ఫీడర్ అంబులెన్స్ కు, సాధారణ అంబులెన్స్ కు మధ్య అనుసంధానం పెంచాలని, ఆసుపత్రుల్లో రోగులకు నాణ్యమైన బెడ్ షీట్లు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. నియోజకవర్గ స్థాయిలో పీపీపీ విధానంలో ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు పీపీపీ ఆసుపత్రులను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తామన్నారు. ఏపీలోని అన్ని ఆసుపత్రుల పనితీరు దేశంలోని అన్ని రాష్ట్రాలకన్నా ముందుండాలన్నారు. ఫీడర్ అంబులెన్స్ లు వెళ్లగలిగినప్పటికీ ఆ ప్రాంతాలకు తీసుకువెళ్లకుండా నిర్లక్ష్యం వహిస్తే తానే ఆ ప్రాంతాలను సందర్శిస్తానన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+