నూతన మంత్రుల జాబితాకు ఏపీ గవర్నర్ ఆమోదం: రేపు ప్రమాణ స్వీకారం చేసేది ఈ 25 మంది ఎమ్మెల్యేలే

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణలో మరో కీలక ఘట్టం ముగిసింది. నూతన మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్న ఎమ్మెల్యేల జాబితాకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదివారం సాయంత్రం ఆమోదం తెలిపారు. కాగా, 11 మంది పాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొత్తం 25 మందితో నూతన మంత్రివర్గం కొలువుదీరనుంది.

సోమవారం కొలువుదీరనున్న ఏపీ నూతన మంత్రర్గం

సోమవారం కొలువుదీరనున్న ఏపీ నూతన మంత్రర్గం

సోమవారం ఉదయం 11.31 గంటలకు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం పక్కనే ఉన్న పార్కింగ్ స్థలంలో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమ ఏర్పాట్లు చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు నూతన మంత్రులకు గవర్నర్ శాఖలు కేటాయించనున్నారు. మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న ఎమ్మెల్యేలకు ఇప్పటికే సీఎంవో నుంచి ఆహ్వానాలు అందడంతో వారంతా విజయవాడ చేరుకున్నారు. కాగా, మంత్రులుగా ప్రమాణస్వీకారం అనంతరం ముఖ్యమంత్రి గవర్నర్‌తో కలిసి కొత్త మంత్రులతో టీ విందులో పాల్గొనడంతోపాటు గ్రూప్‌ ఫొటో తీయించుకుంటారు.

ఏపీ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న ఎమ్మెల్యేలు వీరే

ఏపీ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న ఎమ్మెల్యేలు వీరే

ధర్మన ప్రసాద రావు /శ్రీకాకుళం/వెలమ

సీదిరి అప్పలరాజు /శ్రీకాకుళం/మత్స్యకార
బొత్స సత్యనారాయణ /విజయనగరం/తూర్పు కాపు
రాజన్న దొర /పార్వతీపురం/ఎస్టీ
గుడివాడ అమర్‌నాధ్‌ /అనకాపల్లి/కాపు
ముత్యాలనాయుడు /అనకాపల్లి/కొప్పుల వెలమ
దాడిశెట్టి రాజా /కాకినాడ/కాపు
పినిపె విశ్వరూప్‌ /కోనసీమ/ఎస్టీ
చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ/కోనసీమ/బీసి - శెట్టి బలిజ
తానేటి వనిత /తూర్పుగోదావరి/మాదిగ - ఎస్సీ
కారుమూరి నాగేశ్వరరావు /పశ్చిమ గోదావరి/యాదవ- బీసీ
కొట్టు సత్యనారాయణ /పశ్చిమ గోదావరి/కాపు
జోగి రమేష్ /కృష్ణా/గౌడ - బీసీ
అంబటి రాంబాబు /పల్నాడు/కాపు
మేరుగ నాగార్జున /బాపట్ల/ఎస్సీ
విడదల రజని /గుంటూరు/బీసీ
కాకాణి గోవర్దన్​ రెడ్డి /నెల్లూరు/ఓసీ - రెడ్డి
అంజద్‌ బాషా /కడప/మైనార్టీ
బుగ్గన రాజేంద్రనాథ్​ రెడ్డి /నంద్యాల/ఓసీ - రెడ్డి
గుమ్మనూరు జయరాం /కర్నూలు/ఓసీ - బోయ
ఉషా శ్రీ చరణ్‌ /అనంతపురం కురుమ- బీసీ
ఆదిమూలపు సురేశ్‌ /ప్రకాశం/ఎస్సీ
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి / చిత్తూరు/ఓసీ - రెడ్డి
నారాయణ స్వామి /చిత్తూరు/ఎస్సీ
ఆర్‌ కే రోజా /చిత్తూరు/ఓసీ - రెడ్డి

మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో కీలకంగా సజ్జల రామకృష్ణారెడ్డి

మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో కీలకంగా సజ్జల రామకృష్ణారెడ్డి

కాగా, మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణపై మూడు, నాలుగు రోజుల నుంచి సీఎం కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. శుక్ర, శనివారాలు రెండు రోజులూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని పిలిపించుకుని చర్చించారు. ఆదివారం ఉదయం నుంచి జాబితాపై కసరత్తు జరిగింది. కాగా, మంత్రివర్గ కూర్పులో సజ్జల కీలకంగా వ్యవహరించారనే చర్చ సాగుతోంది. గత మూడు రోజులుగా ఈ విషయంపై సజ్జల రామకృష్ణారెడ్డితో సీఎం పలు దఫాలుగా చర్చించారనే వార్తలు వచ్చాయి. ఆదివారం కూడా సజ్జలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. సీఎం జగన్​తో భేటీ అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. ప్రాంతీయ, సామాజిక సమీకరణాలతోపాటు.. కొత్త మంత్రుల్లో ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనే విషయంపైనా సీఎం సజ్జలతో కలికే ఒక ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం. మంత్రి పదవులు కోల్పోయినవారికి గౌరవం తగ్గకుండా ప్రత్నామ్నాయ ఏర్పాట్లు ఎలా చేయాలనే దానిపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. మొత్తంగా కేబినెట్ కూర్పులో సజ్జల రామకృష్ణారెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+