ఏపీలో 10వేల కొలువులు: నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు 2 నెలలు ఆగాల్సిందే!
అమరావతి: తెలుగులో దేవుడు కరుణించి వరమిచ్చినా పూజారి కనికరించలేదన్న ఓ సామెత ఉంది. ఈ సామెత ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు సరిగ్గా సరిపోతుంది. ఏకంగా 10 వేల పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ ఆర్థిక శాఖ శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
నియామకాల్లో పోలీసులకు పెద్దపీట వేస్తూ, మొత్తం పోస్టుల్లో సగానికి పైగా ఆర్ధిక శాఖ నుంచే భర్తీ చేయాలని నిర్ణయించింది. వెంటనే భర్తీ ప్రక్రియను కూడా మొదలుపెట్టాలని ఏపీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత భారీగా పోస్టుల భర్తీ ఉంటుందని ఎదురుచూస్తున్న తరుణంలో పదివేల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం తెర తీయడం నిరుద్యోగులు ఆనందంలో ఉన్నారు.
అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు జారీ అయ్యేందుకు ఎంత లేదన్నా రెండు నెలల సమయం పడుతుందని ఎపీపీఎస్సీ చైర్మన్ ఉదయ భాస్కర్ చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత అప్పటిదాకా ఉన్న ఉమ్మడి రాష్ట్ర సర్వీస్ కమిషన్ రెండుగా చీలిపోయిందన్నారు.
ఈ క్రమంలో సింగిల్ సభ్యుడు మాత్రమే ప్రస్తుతం ఏపీపీఎస్సీలో ఉన్నారన్నారు. అయితే మొత్తం 9 మంది సభ్యులుండాల్సిన కమిషన్‌లో ఒక్క సభ్యుడితో వేగంగా చర్యలు చేపట్టడం సాధ్యం కాదని ఆయన చెప్పారు. కనీసం మరో ఇద్దరు, ముగ్గురు సభ్యులు అందుబాటులోకి వస్తే తప్పించి ఉద్యోగ నియామకాల్లో వేగాన్ని పెంచలేమని ఆయన చెప్పారు.
కాగా ఇటీవలే ఉదయ్ భాస్కర్‌ను ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఏళ్ల తరబడి ప్రభుత్వ ఉద్యోగాల నియామకం నోటిఫికేషన్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది ఒకరకంగా షాక్‌కు గురి చేస్తోంది. కాగా గ్రూప్-1 మొదలుకొని జూనియర్ టెక్నీషియన్ వరకు అన్ని స్థాయులు, శాఖల్లోనూ పోస్టుల భర్తీకి ఆర్ధిక శాఖ నుంచి అనుమతి లభించింది.
మొత్తంగా చూస్తే ఇరవై వేలకుపైగా పోస్టులు ఖాళీ ఉన్నట్టు ఏపీ ప్రభుత్వం గుర్తించింది. పదోన్నతి ప్రాతిపదికన భర్తీ చేయాల్సినవి, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కేటగిరీలకు చెందిన పోస్టులు వదిలేయగా, నికరంగా 10 వేల పోస్టులు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీచేయాల్సి ఉంటుందని నిర్ధారించింది.
గ్రూప్1 కేటగిరీలో 94 పోస్టులు, గ్రూప్-2లో 750, గ్రూప్-3లో 1,000 పంచాయత్ సెక్రటరీ పోస్టులు, హోమ్ శాఖ తొమ్మిది, మెడికల్ 422, టెక్నికల్ 1,000, ఇతర పోస్టులు 734 ఉన్నాయి.

గ్రూప్ 1
కేటగిరి ఖాళీలు
మున్సిపల్ కమిషనర్ గ్రూప్ 2 13
జిల్లా బీసీ సంక్షేమ అధికారి 5
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ 10
జిల్లా రిజిస్టార్ 8
డిప్యూటి కలెక్టర్ 5
అసిస్టెంట్ ప్రోహిబిషన్,ఎక్సెంజ్
సూపర్‌డెంట్ 10
కమర్షియల్ టాక్స్ ఆఫీసర్లు 4
జిల్లా సోషల్ వెల్‌ఫేర్ ఆఫీసర్లు 4
జిల్లా ట్రైబల్ వెల్‌ఫేర్ ఆఫీసర్లు 2
డిప్యూటీ సూపర్‌డెంట్ ఆఫ్ పోలీస్ 24
మొత్తం 94
గ్రూప్ 2
మున్సిపల్ కమిషనర్ గ్రూప్ 312
డిప్యూటీ తహసీల్ధార్ 250
సబ్ రిజిస్టార్ గ్రూప్.2 27
అసిస్టెంట్ కమర్షియల్
టాక్స్ ఆఫీసర్లు 90
అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు 8
సీనియర్ ఆడిటర్ 35
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు 16
సీనియర్ అకౌంటెంట్ 180
జూనియర్ అకౌంటెంట్ 35
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు 98
మొత్తం 750
గ్రూప్ 3
పంచాయతీ సెక్రటరీ గ్రూప్-3 1000
మొత్తం 1000
హోమ్ డిపార్ట్‌మెంట్
వెల్‌ఫేర్ ఆర్గనైజర్ 6
జిల్లా సైనిక్ వెల్‌ఫేర్ ఆఫీసర్లు 3
మొత్తం 9
మెడికల్ , హెల్త్ సర్వీసెస్
హోమియో మెడికల్ ఆఫీసర్లు 53
ఎన్.ఆర్.ఎస్ జీఏసీ లెక్చరర్లు 3
హోమియో లెక్చరర్లు 34
యునాని మెడికల్ ఆఫీసర్లు 26
ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్లు 72
సివిల్ అసిస్టెంట్ సర్జన్ 24
డెంటల్ అసిస్టెంట్ సర్జన్ 2
సివిల్ అసిస్టెంట్ సర్జన్
స్పెషలిస్ట్ ( గైనిక్ ) 49
సివిల్ అసిస్టెంట్ సర్జన్
స్పెషలిస్ట్ (పెడియాట్రిక్) 44
సివిల్ అసిస్టెంట్ సర్జన్
స్పెషలిస్ట్ (ఎనస్థీషియా) 44
సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ 77
క్లినికల్ సైకాలజిస్ట్ 2
న్యూక్లియర్ ఫిజిసిస్ట్ 1
మొత్తం 422
పోలీసు, జైళ్ల శాఖల్లో ఖాళీల వివరాల
డిప్యూటీ జైలర్ 16
అసిస్టెంట్ మ్యాటరన్ 5
వార్డర్ (పురుషులు) 240
వార్డర్ (స్తీలు) 25
డైవర్ ఆపరేటర్ 55
డీజీపీ ఏపీ హైదరాబాద్
ఎస్సై 287
మహిళా ఎస్సైలు 110
కానిస్టేబుళ్లు 1103
రిజర్వ్ సబ్‌ఇన్‌స్పెక్టర్లు 123
కానిస్టేబుళ్లు 422
మహిళా పీసీ విశాఖసిటీ 12
రిజర్వ్ సబ్‌ఇన్‌స్పెక్టుర్లు 209
అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టుర్లు 13
కానిస్టేబుల్ కమ్ డ్రైవర్ 134
కమ్యూనికేషన్స్ కానిస్టేబుల్ 330
సబ్‌ఇన్‌స్పెక్టుర్లు 15
మహిళా పీసీ 164
సబ్‌ఇన్‌స్పెక్టుర్లు 9
విజయవాడ కమిషనరేట్..
కానిస్టేబుల్(సివిల్) 653
మహి ళా పీసీ 35
కానిస్టేబుల్(ఏఅర్) 585
మహిళా పీసీ(ఏఆర్) 54
గుంటూరు రూరల్ ..
కానిస్టేబుల్ (సివిల్) 868
మహిళా పీసీ(సివిల్) 15
ఏఆర్ సబ్‌ఇన్‌స్పెక్టర్ 4
ఏఆర్ కానిస్టేబుల్స్ 273
గుంటూరు అర్బన్....
కానిస్టేబుల్(సివిల్) 62
మహిళా పీసీ(సివిల్) 26
కానిస్టేబుల్(ఏఆర్) 59
మొత్తం పోస్టులు 5991
టెక్నికల్ సర్వీసులు
ఎడిటిపి 5
టిపిఎ 3
ఎఎడి 1
సర్వేయర్ 4
ఏఈఈ(ఫీహెచ) 50
ఏఈ(ఈఎనవి) 50
ఎమ్‌ఏఈ(సివిల్) 80
ఏఈ(పీహెచ) 30
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 40
అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ 8
ఏఈఈ(మెకానికల్) 2
అసిస్టెంట్ కెమిస్ట్ 2
టెక్నికల్ అసిస్టెంట్(హెచ) 13
టెక్నికల్ అసిస్టెంట్(జీపీ) 9
టెక్నికల్ అసిస్టెంట్(హెచ) 3
అసిస్టెంట్ ఇంజనీర్(సివిల్) 9
ల్యాబ్ అసిస్టెంట్ 3
అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ 8
ఏఈఈ 350
ఇన్సపెక్టర్‌అఫ్ ప్యాక్టరీస్ 3
ఇన్సపెక్టర్‌అఫ్ బాయిలర్స్ 1
డిప్యూటీ. సర్వేయర్లు 200
ఏఈఈ 88
రాయల్టీ ఇన్సపెక్టర్ 5
టెక్నికల్ అసిస్టెంట్ 25
అసిస్టెంట్ డైరెక్టర్ 8
ఇతర సర్వీసులు
హస్టల్ వెల్ఫ్‌ర్ గ్రేడ్-2 100
అసిస్టెంట్ బీసీ సంక్షేమ అధికారి 10
లెక్చరర్స్ 235
అసిస్టెంట్ సోషల్ వెల్ఫ్‌ర్ ఆఫీసర్ 9
అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫ్‌ర్ ఆఫీసర్ 6
ఫిషరిస్ డెవలెప్‌మెంట్ ఆఫీసర్ 4
వెటరనరీ అసిస్టెంట్ సర్జన 300
అగ్రికల్చరల్ ఆఫీసర్ 30
అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 30
మొత్తం 734
అత్యధికంగా పోలీసు శాఖలో 5,500కుపైగా పోస్టులను భర్తీచేయబోతున్నారు. జైళ్లశాఖతో కలిపి ఈ సంఖ్య 5,991 అవుతుంది. 397 సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు మంజూరుకాగా, అందులో 110 పోలీసులను మహిళలకు కేటాయించారు. ఇక, ఏపీపీఎస్సీ ద్వారా 4,009 పోస్టులు భర్తీచేస్తారు.












Click it and Unblock the Notifications