ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కుండపోత: మూడు రోజుల పాటు
అమరావతి: వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వచ్చే 24 గంటల వ్యవధిలో ఉత్తర, దక్షిణ కోస్తాలతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. పశ్చిమ బెంగాల్ కోస్తా తీరానికి దగ్గరగా వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటమే దీనికి కారణమని పేర్కొన్నారు.
సముద్రమట్ట నుంచి మూడున్నర కిలోమీటర్ల ఎత్తున ఈ ఆవర్తనం విస్తరించిందని, దీని ప్రభావం కోస్తా, రాయలసీమ జిల్లాలపై ఉంటుందని స్పష్టం చేశారు. మరో ఉపరితల ఆవర్తనం బంగాళాఖాతం పశ్చిమ మధ్య ప్రాంతంలో ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేశారు. సముద్ర మట్టానికి నాలుగున్నర కిలోమీటర్ల నుంచి ఏడున్నర కిలోమీటర్ల ఎత్తన ఆవర్తనం ఏర్పడటానికి అనుకూల వాతావరణం ఉందని అన్నారు. క్రమంగా ఇది అల్పపీడనంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.

ఈ రెండింటి ప్రభావం వల్ల వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఉత్తరాంధ్రలోని విశాఖపట్న, విజయనగరం, శ్రీకాకుళం..ఉత్తర కోస్తాలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు, దక్షిణ కోస్తా ప్రాంతంలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదవుతుందని తెలిపారు. నెల్లూరు జిల్లాకు ఆనుకుని ఉన్న రాయలసీమ రీజియన్ పరిధిలోని చిత్తూరు జిల్లాపైనా దీని ప్రభావం ఉంటుందని అంచనా వేశారు.
చిత్తూరు జిల్లాలో తేలికపాటి జల్లులతో పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అన్నారు. అలాగే- కర్ణాటక మీదుగా విస్తరించిన ద్రోణి ప్రభావం వల్ల ఆ రాష్ట్రానికి ఆనుకుని ఉన్న సీమ జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. తిరుపతి, గుంటూరు, నూజివీడుల్లో ప్రస్తుతం భారీ వర్షం కురుస్తోంది. తెలంగాణలోనూ మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు.
వచ్చే రెండు రోజులు తెలంగాణలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. వచ్చే 48 గంటల్లో అంటే శని, ఆదివారాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. రెండు రోజుల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు కురుస్తాయని అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షపాతం నమోదవుతుందనే అంచనాలు ఉన్నాయి. శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, పలాస, సోంపేట, టెక్కలి, నరసన్నపేట, పాతపట్నంలల్లో భారీ వర్షం కురుస్తోన్నట్లు ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ తెలిపారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.
Heavy rain now in #Srikakulam city 😍😍 https://t.co/uYz9Q68bzu pic.twitter.com/tVcRmms9cn
— Andhra Pradesh Weatherman (@APWeatherman96) August 27, 2021
Started raining at #Tirupati now pic.twitter.com/mupZmJdXB6
— Andhra Pradesh Weatherman (@APWeatherman96) August 27, 2021
Recommended Video
Heavy Downpour #Nuzendla #Guntur https://t.co/Kbksfeg2ut pic.twitter.com/ytnObGMBH2
— RK Reddy kurukuntla (@ramakotireddyK) August 27, 2021












Click it and Unblock the Notifications