వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విస్ట్: 2 వారాల్లో రూ. 10 కోట్లు చెల్లిస్తే సదావర్తి భూములు మీకే : హైకోర్టు

సదావర్తి సత్రం భూములపై ఉమ్మడి హైకోర్టు సోమవారం నాడు కీలక తీర్పు ఇచ్చింది. ఏపీ సర్కార్ సదావర్తి సత్రానికి చెందిన 84 ఎకరాల భూమిని కొంతమంది పెద్దలకు రూ.22 కోట్లకే కట్టబెట్టారు. అయితే ఈ విషయమై మరో 10 కో

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సదావర్తి సత్రం భూములపై ఉమ్మడి హైకోర్టు సోమవారం నాడు కీలక తీర్పు ఇచ్చింది. ఏపీ సర్కార్ సదావర్తి సత్రానికి చెందిన 84 ఎకరాల భూమిని కొంతమంది పెద్దలకు రూ.22 కోట్లకే కట్టబెట్టారు. అయితే ఈ విషయమై మరో 10 కోట్లు చెల్లిస్తే ఈ భూములను కేటాయిస్తామని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి కోర్టు తెలిపింది. అయితే రెండు వారాల్లో ఈ డబ్బును చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

సదావర్తి సత్రానికి చెందిన 84 ఎకరాలల భూమిని కొంతమంది పెద్దలకు రూ. 22 కోట్లకే కట్టబెట్టింది ఏపీ ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు.

Andhra pradesh high court key verdict on Sadavarti lands

ఈ విషయమై విచారణ జరిపిన హైకోర్టు సోమవారం నాడు తుదితీర్పును ఇచ్చింది. రూ.22 కోట్ల కంటే ఎక్కువగా మరో రూ. 5 కోట్ల చెల్లిస్తే ఆ భూములను మీకే కేటాయిస్తామని ఆళ్ళ రామకృష్ణారెడ్డి కి కోర్టు బంపర్ ఆఫరిచ్చింది.

అయితే ఆ రూ. 5 కోట్ల కంటే ఎక్కువగా డబ్బులను చెల్లించేందుకు తాను సిద్దమేనని రామకృష్ణారెడ్డి కోర్టుకు చెప్పాడు. అయితే రెండు వారాల్లో రూ. 10 కోట్లను చెల్లించాలని హైకోర్టు రామకృష్ణారెడ్డికి సూచించింది. మరోవైపు హైకోర్టు తీర్పును ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్వాగతించారు.

English summary
Andhra pradesh high court key verdict on Sadavarti lands on Monday.IF Pay Rs.10 crore within two weeks ,will allot Sadavarti lands to petitioner Ramakrishna Reddy said court, Ramakrishana reddy accepted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X