ప్రకాశం జిల్లాకు గుడ్ న్యూస్: రెండు మెగా సోలార్ విద్యుత్ ప్లాంట్లకు లైన్ క్లియర్, 7.5 లక్షల మందికి ఉపాధి..!
Andhra Pradesh: ప్రకాశం జిల్లాలో రెండు ఆల్ట్రా మెగా సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి గొట్టిపాటి మంగళవారం సమాధానం చెప్పారు. దీనికి సంబంధించి మంత్రి గొట్టిపాటి రవికుమార్ సభలో మాట్లాడుతూ... రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు రాయలసీమ తరువాత ప్రకాశం జిల్లానే అత్యంత అనువైన ప్రాంతమని తెలిపారు. ప్రకాశం జిల్లా దొనకొండ, చంద్రశేఖరపురం ప్రాంతాల్లో మెగా సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఒక్కో ప్లాంట్ నిర్మాణానికి సుమారు 5,500 ఎకరాల భూమి అవసరమని మంత్రి స్పష్టం చేశారు. ప్లాంట్ల నిర్మాణానికి భూ కేటాయింపులకు సంబంధించి ఇప్పటికే ప్రకాశం జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక కోరామని వెల్లడించారు. కలెక్టర్ నివేదిక తరువాత సోలార్ ప్లాంట్ల నిర్మాణాన్ని చేపడుతామని మంత్రి వివరించారు. ఒక్కో సోలార్ విద్యుత్ ప్లాంట్ ద్వారా సుమారు 1,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు.
ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ -2024 గేమ్ ఛేంజర్.....
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ - 2024 (ఐసీఈ) ద్వారా పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఏపీ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా 7.5 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ పాలసీ ద్వారా 100 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకెళ్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అసెంబ్లీ వేదికగా వివరించారు.

-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications