Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాపు రిజర్వేషన్లు సహా ఇలా చేస్తా: పవన్ వరాలజల్లు, సీఎంనే అడుగు.. టీడీపీకి దిమ్మితిరిగే షాక్

ఏలూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కులాల మధ్య చిచ్చుపెట్టడం ఆపాలని, ఏపీలో సీఎం, జగన్ కుటుంబాలు, వారి సిండికేట్లు బాగుపడుతున్నారని జనసేన అధినేత పవన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అచంట, పాలకొల్లు నియోజకవర్గ బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జనసేనాని ప్రజలపై వరాల వర్షం కురిపించారు.

Recommended Video

    త్వరలో ఉమ్మడి అజెండాతో దుసుకుపోనున్న జనసేన

    చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లలో బీసీలకు పెంపు ఉంటుందని, ఎస్సీలను ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి తీసుకు వస్తామని, 9వ షెడ్యూల్ ద్వారా కాపులకు రిజర్వేషన్ కల్పించే ప్రయత్నం చేస్తామని, ముస్లీం అభ్యున్నతికి సచార్ కమిటీ చెప్పిన విధానాలు అమలు చేస్తామని, ఆర్థికంగా వెనుకబడిన అగ్రకుల యువతకు అండగా ఉండేందుకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని, వీటన్నింటిని జనసేన మేనిఫెస్టోలో పొందుపర్చి అమలు చేస్తామన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టి ఆమోదించాలన్నారు.

    పెద్ద ఎత్తున పవన్ వరాలు

    సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ పవన్ జనసేన లక్ష్యాలను వివరించారు. ప్రజలకు ఏం చేస్తామో చెప్పారు. వరాలు కురిపించారు. అధికారంలోకి వస్తే మహిళలకు ఉచితంగా గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామని, రేషన్‌ బదులు నగదు బదిలీ చేస్తామని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామని, చట్ట సభల్లో మహిళలకు 33 శాతం కోటా దక్కేలా కృషి చేస్తామన్నారు. అవినీతిని అంతమొందిస్తామని, దోపిడీని నియంత్రిస్తామన్నారు.

    మీకు డబ్బులు రావంటే హోదా అంటారా?

    టీడీపీ, వైసీపీ, బీజేపీలపై పవన్ విమర్శలు గుప్పించారు. మీ నాయకులకు డబ్బులు వస్తాయంటే ప్యాకేజీకి అంగీకరిస్తారా? డబ్బులు రావనుకుంటే ప్రత్యేక హోదా కోసం పోరాడతారా? అని టీడీపీని నిలదీశారు. రాష్ట్రంలో అభివృద్ధి అంతా రెండు కుటుంబాల మధ్యే ఉండిపోతోందని, ఆ కుటుంబాలే బాగుపడుతున్నాయని, కానీ కులాలు బాగుపడటం లేదన్నారు. అందుకోసమే పలు కులాల వారు రిజర్వేషన్లు కోరుతున్నారన్నారు. ఏపీలో బీజేపీపై నమ్మకం పోయిందన్నారు. తన పార్టీకి అజెండా లేదని టీడీపీ నేతలు చెబుతున్నారని, అలాంటప్పుడు 2014లో తన పార్టీ ఆఫీస్‌కు మీ అధినేత చంద్రబాబు ఎందుకు వచ్చారో, ఎందుకు మద్దతు అడిగారో ఆయన్ను అడగమని దిమ్మతిరిగే షాకిచ్చారు.

    రూపాయికి కిలో బియ్యం కాదు.. రూ.2500వేలు ఇస్తాం

    జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. చట్టసభల్లో ప్రాతినిథ్యం లేని వెనుకబడిన కులాలకు ప్రాతినిథ్యం ఇస్తామన్నారు. రూపాయికి ఇచ్చే బియ్యం తినేందుకు అనుకూలంగా లేవని, దానికి బదులు మహిళల ఖాతాలకు రూ.2500 నుంచి రూ.3000 వరకు జమ చేస్తామన్నారు. బాధ్యతాయుతమైనన మద్యపాన నిషేధం అమలు చేస్తామన్నారు. 75 శాతం మహిళలు వ్యతిరేకించిన చోట అమ్మకాలు బంద్ చేస్తామన్నారు. సీపీఎస్ విధానం రద్దుకు ప్రయత్నిస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణపై సామరస్య పరిష్కారం ఉంటుందన్నారు.

    వాళ్లే బాగుపడుతున్నారు

    చంద్రబాబు, జగన్‌ల వలె తనకు మాటలు మార్చడం తెలియదని పవన్ అన్నారు. కష్టమో, నష్టమో ఇచ్చిన మాట మీద నిలబడతానని చెప్పారు. జనం అందరి క్షేమాన్ని తాను కోరుకుంటానని, తాన రాజకీయాల్లోకి వచ్చింది టీడీపీ సంక్షేమం కోసం కాదని, ప్రజల సంక్షేమం కోసమన్నారు. జగన్, చంద్రబాబు కుటుంబాల వాళ్లు బాగుపడుతున్నారని, ఇతరులు ఎవరూ బాగుపడట్లేదన్నారు.

    మోడీని అడుగుతున్నా

    మన దేశంలో మహిళను శక్తిస్వరూపిణిగా పూజిస్తామని, దేశాన్ని భారతమాత అంటామని, కానీ మహిళా భద్రత, సాధికారత పట్టించుకోరని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. చట్టసభల్లో స్థానం కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించరన్నారు. నాడూ యూపీఏ హయాంలోను దానిని ఆమోదించలేదని, మహిళా బిల్లును తేవాలని తాను ప్రధాని మోడీని అడుగుతున్నానని చెప్పారు. భీమవరం డంపింగ్ యార్డును సందర్శించి అధికార పార్టీపై నిప్పులు చెరిగారు.

    తెలంగాణలో టీడీపీ లేదు, జగన్ మహిళల్ని అవమానిస్తారు

    తెలంగాణలో టీడీపీ లేదు, జగన్ మహిళల్ని అవమానిస్తారు

    బీసీల పార్టీగా చెప్పుకొనే టీడీపీ తెలంగాణలో కనపడకుండా పోయిందని, బీసీల ఆత్మగౌరవాన్ని పట్టించుకోకుండా వారిని ఓట్లు కోసమే వినియోగించుకున్నందువల్లే అక్కడ టీడీపీని తరిమికొట్టారని పవన్ అన్నారు. జగన్‌ మహిళలను కించపరుస్తారని, నేను మాత్రం ఎవరి కుటుంబాల్లోని మహిళలనైనా గౌరవిస్తానని తెలిపారు. కాపు రిజర్వేషన్లపై జగన్‌ మాట మార్చారని, తాను మాత్రం ఓట్ల కోసం మాట్లాడనన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+