మండే ఎండల్లో ఏపీకి చల్లని కబురు

ఏపీలో విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఒకవైపు వర్షాలు ఉంటే.. మరోవైపు వడగాడ్పులు వీస్తున్నాయి. ఈ పరిస్థితి మూడురోజులు కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద దక్షిణ ఛత్తీస్‌గఢ్, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది. ఏపీ, యానాంలో దిగువ ట్రిపో ఆవరణంలో దక్షిణ దిశగా లేదంటే నైరుతి దిశగా గాలు వీస్తున్నాయి. రాబోయే మూడు రోజులకు వాతావరణశాఖ కీలక సూచనలు చేసింది.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఒకటి లేదా రెండు చోట్ల కురవడానికి అవకాశముంది. వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆది, సోమవారాల్లో తేలికపాటి వర్షము లేదంటే ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురవడానికి అవకాశముంది. ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు గంటకు 30 - 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఉంటుంది.

andhra pradesh latest weather report

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో శవివారం, ఆదివారం, సోమవారం వాతావరణం పొడిగా ఉంటుంది. వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడుతుంది. రాయలసీమ లో శవివారం, ఆదివారం, సోమవారం వాతావరణం పొడి గా ఉండే అవకాశం ఉంది. ఒకటి రెండుచోట్ల వడగాడ్పులు వీచే అవకాశం ఉంది.

వడగాడ్పులు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వీస్తున్నాయని, అటువంటి సమయంలో సాధ్యమైనంత వరకు పనులన్నింటినీ ఉదయమే పూర్తిచేసుకోవాలని, ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగులు ధరించి వెళ్లాలని, వడదెబ్బకు గురవకుండా వైద్యుల సలహాలు, సూచనల మేరకు వ్యవహరించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+