టాప్ లో నిలిచిన ఏపీ..! ప్రతీ నలుగురిలో ఒకరు..! ఫోర్బ్స్ రిపోర్ట్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణకు గత కొన్ని నెలలుగా చేస్తున్న విశ్వప్రయత్నాలు క్రమంగా ఫలిస్తున్నాయి. ఇప్పటికే గతేడాది విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సు, అంతకు ముందే సాగరనగరానికి వచ్చిన గూగుల్ డేటా సెంటర్.. ఇలా భారీ ప్రాజెక్టుల్ని రాబట్టుకోవడంలో ఏపీ సక్సెస్ అవుతోంది. తాజాగా ఫోర్బ్స్ మ్యాగజైన్ వెల్లడించిన గణాంకాల్లోనూ ఇదే స్పష్టమైంది. దేశంలోనే పెట్టుబడుల ఆకర్షణలో బీజేపీ పాలిత రాష్ట్రాల్ని సైతం తోసిరాజని ఏపీ మొదటిస్ధానంలో నిలిచింది.

దేశంలోనే పెట్టుబడుల ఆకర్షణ కేంద్రంగా ఏపీ మారుతోందని ఫోర్బ్స్ తన నివేదికలో వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో ప్రతిపాదిత పెట్టుబడులలో 25.3% భారీ వాటాను రాష్ట్రం సొంతం చేసుకుందని తెలిపింది.పారిశ్రామిక వేగం తూర్పు, దక్షిణ కారిడార్ల వైపు మారడంతో ఒడిశా (13.1%), మహారాష్ట్ర (12.8%) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయని పేర్కొంది. ప్రతిపాదిత మూలధనంలో గణనీయమైన 51.2% వాటా ఇప్పుడు ఈ మూడు రాష్ట్రాలలోనే కేంద్రీకృతమై ఉందని తెలిపింది. మొత్తం మీద ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలలకు పెట్టుబడి ప్రకటనలు గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 11.5% ఎక్కువగా 26.6 లక్షల కోట్లుగా ఉన్నాయని వెల్లడించింది.

Andhra Pradesh Leads India in Investment Secures Massive 25 3 Share in 9 Months

ఈ వివరాలను వివరిస్తూ ఫోర్స్బ్ ఎక్స్ లో షేర్ చేసిన కథనాన్ని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రీట్వీట్ చేశారు. భారతదేశం యొక్క ప్రస్తుత ఆర్ధిక సంవత్సర పెట్టుబడులలో 25.3% శాతం వాటాకు ఆంధ్రప్రదేశ్ చేరుకోవడం లేదు, అది ముందుకు దూసుకుపోతోందంటూ గర్వంగా పేర్కొన్నారు. వ్యాపారం చేయడంలో వేగం ఇలా కనిపిస్తుందని లోకేష్ తెలిపారు. ఇప్పటికే రాష్ట్రం పెట్టుబడుల ఆకర్షణ విషయంలో చూపుతున్న చొరవకు ఇది నిదర్శనంగా మారింది. ే

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+