ఏపీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు..!!
స్థానిక ఎన్నికల వేళ రాష్ట్రంలో రాజకీయం ఆసక్తిగా మారుతోంది. కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నామినేషన్ల సమయంలో చోటు చేసుకున్న ఘర్షణల వ్యవహారం సుప్రీం వరకు వెళ్లింది. సుప్రీంకోర్టు సూచనల మేరకు మున్సిపల్ ఎన్నికల తేదీల్లో మార్పులు జరిగాయి. నవంబర్ 1వ తేదీన పోలింగ్ జరగనుంది. అయితే, అనూహ్యంగా ఏపీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు రంగంలోకి దిగటం ఆసక్తి కరంగా మారుతోంది.
ఏపీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలోకి ఎంఐఎం నేతలు దిగుతున్నారు. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా వ్యవహరిస్తున్న ఎంఐఎం మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, బీహార్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తోంది. ఇప్పుడు ఏపీలో మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగింది. ఎంఐఎం పార్టీ కడప కార్పొరేషన్ మేయర్ పదవికి, హిందూపురం మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ స్థానానికి తమ పార్టీ అభ్యర్థులతో నామినేషన్లు దాఖలు చేయించింది. విజయవాడ, కడప కార్పొరేషన్లతో పాటు మరో 5 మున్సిపాలిటీల్లో మొత్తం 21 మంది మజ్లిస్ అభ్యర్థులు పోటీలో నిలిచారు.

మజ్లిస్ పార్టీకి రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు తాజాగా పార్టీ అధినేత అసద్ తో హైదరాబాద్ లో భేటీ అయ్యారు. స్థానిక ఎన్నికల్లో పోటీ పైన ప్రతిపాదనలు చేసారు. రాష్ట్రంలో నెలకున్న తాజా రాజకీయాలను వివరించారు. దీంతో, అసద్ ఆమోదంతో ఆ పార్టీ అభ్యర్ధులు మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగారు. ఇప్పుడు వీరికి మద్దతుగా ప్రచారం కోసం ఎంఐఎం ఎమ్మెల్యేలు రావటం కీలకంగా మారుతోంది.
కడప కార్పొరేషన్ పరిధిలో ముస్లిం ఓటింగ్ ఎక్కువ శాతం ఉంది. అక్కడ ఇప్పుడు టీడీపీ, వైసీపీ మధ్య హోరా హోరీ పోరు నెలకొంది. దీంతో, ఐఎంఐం సైతం మేయర్ పదవికి, విజయవాడ కార్పొరేషన్‌లోని మూడు డివిజన్లకు అభ్యర్థులను ఖరారు చేశారు. హిందూపురం పురపాలక ఛైర్‌పర్సన్ స్థానంతో పాటు మరో 5 వార్డుల్లో మజ్లిస్ పార్టీ అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు.
కాగా.. ఆదోని-7, రాయదుర్గం-3, పెనుగొండ, నంద్యాల మున్సిపాలిటీల్లో ఒక్కో వార్డు చొప్పున పోటీ చేస్తున్నారు. వీరి కోసం ఎంఐఎం ఎమ్మెల్యేలు జాఫర్ హుస్సేన్ మిరాజ్, మాజిద్ హుస్సేన్, మహ్మద్ ముబీన్తో పాటు ఎమ్మెల్సీ రియాజ్ ఉల్ హసన్ ఎఫెండీలు తమ అభ్యర్దులకు మద్దతుగా ప్రచారం ప్రారంభించారు. నవంబర్ 1న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో.. ఎంఐఎం తమకు వచ్చే ఓట్లు.. స్పందనకు అనుగుణంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పైన నిర్ణయం తీసుకోనుంది.














Click it and Unblock the Notifications
