ఆంధ్రాలో జే బ్రాండ్ లిక్కర్ కు చెక్, సీఎంతో మంత్రి వర్గం ఉప సంఘం చర్చలు
ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మద్యం విధానం వలన వేలాది మంది ఆడపడుచుల మంగళసూత్రాలు తెగిపోయాయని, మద్యం తాగి చనిపోయిన వాళ్ళ కుటుంబాలు నేడు రోడ్డున పడ్డాయని కూటమి ప్రభుత్వంలోని మంత్రులు మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో జే బ్రాండ్ లిక్కర్ విక్రయించడంతో మద్యం తాగడానికి బానిసలు అయిన వాళ్ళ జీవితాలు నాశనం అయ్యాయని ఆంధ్రప్రదేశ్ లోని మంత్రులు ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ లోని చాలా మంది మందుబాబులు జే బ్రాండ్ లిక్కర్ తాగడం వలన వారి జీవితాలే నాశనం అయ్యాయని కూటమి ప్రభుత్వంలోని పలువురు మంత్రుల ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ జే బ్రాండ్ మద్యం కనపడకుండా చేస్తామని, త్వరలో కొత్త మద్యం పాలసీ అమలులోకి వస్తుందని కూటమి ప్రభుత్వంలోని మంత్రులు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు చేసిన ఆగడాలపై మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

మంగళవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడుతో మంత్రివర్గ ఉప సంఘం సమావేశం అయ్యింది. ఇదే సమయంలో నూతన మద్యం విధానంపై సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి వర్గ ఉప సంఘంతో చర్చించారు. అనంతరం మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్య కుమార్ మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు విక్రయించిన జే బ్రాండ్ నాసిరకం మద్యంపై మంత్రులు మండిపడ్డారు. జగన్ అండ్ కో వారి జేబులు నింపుకోవడానికి దిక్కుమాలిన మద్యం బ్రాండ్లు విక్రయించారని మంత్రులు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో మల్టీ నేషనల్ బ్రాండ్ల లిక్కర్ కంపెనీలు అడుగుపెట్టకుండా జగన్ అండ్ కో కుట్రలు చేశారని మంత్రులు మంత్రుల ఆరోపించారు.
త్వరలోనే తక్కువ ధరకు పాత మద్యం బ్రాండ్లు విక్రయించడానికి చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యం గురించి చంద్రబాబు ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నదని మంత్రులు వివరించారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం విధానం అమలులోకి వస్తుందని మంత్రులు మరోక్షంగా చిన్న క్లూ ఇచ్చారు. అయితే రెండు రోజుల్లో అధికారికంగా ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలిసింది.












Click it and Unblock the Notifications