ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీదే హవా: సీప్యాక్ ఒపీనియన్ పోల్ క్లియర్

పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ.. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం హీటెక్కుతోంది. అధికార తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. తమ ప్రభుత్వ పనితీరు ఆధారంగా టీడీపీ కూటమి జనంలోకి దూసుకెళ్తోండగా.. ఈ రెండున్నరేళ్లల్లో ఏ మాత్రం కూడా పరిష్కారానికి నోచుకోని స్థానిక సమస్యలను వైఎస్ఆర్సీపీ ప్రచారాస్త్రంగా మలచుకుంది. సంక్షేమ పథకాల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం కోత పెట్టిందని, వాటి అమలు విధానాన్ని విమర్శిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తోంది.

రాష్ట్రంలో 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలకు నవంబర్ 1వ తేదీన పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. 3వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ పరిణామాల నేపథ్యంలో.. స్థానిక సంస్థల ఎన్నికలపై సీప్యాక్ తాజాగా ఒపీనియన్ పోల్ నిర్వహించింది. వాటి ఫలితాలు కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో అధికార టీడీపీ కూటమి స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించే అవకాశం ఉందని ఈ ప్రీ పోల్ సర్వే నివేదిక స్పష్టం చేసింది. మెజారిటీ మున్సిపాలిటీలను ఈ కూటమి కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది.

Andhra Pradesh Municipal Pre Poll Predicts TDP Gains Momentum Set for Clear Lead CPAC Survey Shows

ప్రత్యేకించి.. పట్టణ ప్రాంత ఓటర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి పట్టం కడతారని సీప్యాక్ సర్వే అభిప్రాయపడింది. దాదాపుగా రాష్ట్రవ్యాప్తంగా కూడా మెజారిటీ ఓటర్లు టీడీపీ కూటమి వైపు మొగ్గు చూపుతున్నారని ఈ ఒపీనియన్ పోల్ పేర్కొంది.

చిలకలూరిపేటలో వైసీపీకి బిగ్ షాక్..: రాత్రికి రాత్రి టీడీపీలో చేరిక
చిలకలూరిపేటలో వైసీపీకి బిగ్ షాక్..: రాత్రికి రాత్రి టీడీపీలో చేరిక

సీప్యాక్ విడుదల చేసిన తుది నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 13 మునిసిపల్ కార్పొరేషన్లను టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు అధికంగా అధికంగా ఉన్నాయి. వీటిలో టీడీపీ 10 స్థానాల్లో జెండా పాతనుంది. రెండు చోట్ల జనసేన, ఒక స్థానంలో బీజేపీ విజయం సాధిస్తాయి. వైఎస్ఆర్సీపీ ఏ ఒక్క కార్పొరేషన్‌లో కూడా ఖాతా తెరవలేకపోవచ్చని సీప్యాక్ ఒపీనియన్ పోల్ ఫలితాలు తేల్చి చెప్పాయి. నగర ఓటర్లల్లో వైసీపీ పట్ల కొంత వ్యతిరేకత ఉందనేది ఇక్కడ స్పష్టమౌతోంది.

ఏపీ తీరానికి దూసుకొస్తోన్న సూపర్ సైక్లోన్: 140 కి. మీ వేగంతో ప్రచండగాలులు: బాపట్ల- విశాఖ మధ్య
ఏపీ తీరానికి దూసుకొస్తోన్న సూపర్ సైక్లోన్: 140 కి. మీ వేగంతో ప్రచండగాలులు: బాపట్ల- విశాఖ మధ్య

మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో మొత్తం 87 స్థానాలకు గాను టీడీపీ కూటమి ఏకంగా 71 స్థానాలను కైవసం చేసుకుంటుందని సీప్యాక్ సర్వే పేర్కొంది. ఇందులో టీడీపీకి 55 మునిసిపాలిటీలు దక్కుతాయి. జనసేన 14 చోట్ల, బీజేపీ- 2 స్థానాల్లో జెండా ఎగురవేస్తాయి. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీకి ఎదురుదెబ్బే తగలొచ్చు. ఆ పార్టీ 16 మునిసిపాలిటీలతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని ఈ సర్వే నివేదిక స్పష్టం చేస్తోంది. కార్పొరేషన్లతో పోల్చుకుంటే మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వైసీపీ కొంత పట్టు ఉన్నట్టే.

కూటమి ప్రభుత్వ పాలన పట్ల పట్టణ ప్రజల్లో వ్యక్తమవుతున్న సానుకూలత, అభివృద్ధి కార్యక్రమాలపై ఉన్న నమ్మకమే ఈ తరహా అంచనాలకు ప్రధాన కారణమని సీప్యాక్ అభిప్రాయపడింది. ఇది ఒపీనియన్ పోల్ అంచనాలు మాత్రమేనని స్పష్టం చేసింది. ఈ సర్వే ఫలితాలు టీడీపీ కూటమి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపినట్టయింది. స్థానిక సమస్యలు, అభ్యర్థుల ఎంపిక, ఓటింగ్ నాటి పరిస్థితులు తుది ఫలితాలను నిర్దేశిస్తాయని వైసీపీ చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+