జోగి రమేష్ కు కౌంట్ డౌన్, సార్ మీరు వస్తారా?, మమ్మల్ని రమ్మంటారా, మీ ఇష్టం

ఆంధ్రప్రదేశ్ లో అధికారం దూరమైన తర్వాత వైసీపీ నాయకుల్లో టెన్షన్ మొదలైంది. గతంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని, ఆయన కుమారుడు నారా లోకేష్ ని, జనసేన అధినేత పవన్ కల్యాణ్ని బహిరంగ సభల్లో నోటికి వచ్చినట్లు బూతులు తిట్టిన వైసీపీ నాయకులకి ఇప్పుడు టెన్షన్ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని వైసీపీ నాయకులు హడలిపోతున్నారు.

ఇప్పటికే వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని జైలు పాలయ్యాడు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీకి చెందిన నాయకుల్లో దడ మొదలైంది. ఇప్పుడు వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ వంతు వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంపై జరిగిన దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు నాయుడు నివాసంపై జరిగిన దాడి కేసులో విచారణకు హాజరు కావాలని వైసీపీ నాయకుడు జోగి రమేష్ కి పోలీసులు నోటీసులు జారీ చేశారు.

https telugu oneindia com news andhra-pradesh municipal-councilors-give-green-signal-to-hindupuram-chairman-indraja-resignation-400251 html

పోలీసుల ముందు మంగళవారమే విచారణకు హాజరు కావాల్సిన జోగి రమేష్ చివరికి విచారణకు మాత్రం హాజరు కాలేదు. గతంలో పోలీసుల ముందు విచారణకు హాజరు కావాల్సిన జోగి రమేష్ ఆయన కుమారుడు అరెస్టును సాకుగా చూపిస్తూ పోలీసులు ముందుకు రాలేదు. అయితే మరోసారి నోటీసులు జారీ చేసిన పోలీసులు విచారణకు హాజరు కావాలని వైసీపీ నాయకుడు జోగి రమేష్ కి సూచించారు.

పోలీసులు ముందు హాజరైతే అరెస్టు చేస్తారనే భయంతో మాజీ మంత్రి జోగి రమేష్ కావాలని తప్పించుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే మాజీ మంత్రి జోగి రమేష్ తన లాయర్లను మంగళగిరి డీఎస్పీ దగ్గరకు పంపించి తన కేసు గురించి వివరాలు అడిగి తెలుసుకోవాలని చెప్పారు. ఇప్పటికే మంగళగిరి డీఎస్పీతో జోగి రమేష్ లాయర్లు చర్చించారని సమాచారం. మొత్తం మీద ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి వైసీపీ నాయకుడు జోగి రమేష్ పోలీసులు ముందు హాజరు కావాల్సి ఉంది.

Andhra Pradesh Police has once again issued notices to YCP leader Jogi Ramesh

పోలీసుల విచారణకు జోగి రమేష్ హాజరు కాకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని, ఆయన ఇంటికే పోలీసులు వెళ్లే అవకాశం ఉందని సమాచారం. గతంలో మంత్రిగా పనిచేసిన జోగి రమేష్ తాను మంత్రి అనే విషయం మర్చిపోయి బహిరంగ సభల్లో నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను నోటికి వచ్చినట్లు బూతులు మాట్లాడిన విషయం తెలిసిందే.

Andhra Pradesh Police has once again issued notices to YCP leader Jogi Ramesh

వైసీపీ నాయకుడు జోగి రమేష్ మాట్లాడిన బూతు పురాణం వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. వైసీపీ నాయకుడు జోగి రమేష్ బూతులు తిట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, నారా లోకేష్ మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. మొత్తం మీద కర్మ వెంటాడుతుంటే ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అనే సామెతలా ఇప్పుడు మాజీ, వైసీపీ నాయకుడు జోగి రమేష్ తాను అరెస్టు కాకుండా నానా తంటాలు పడుతున్నారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+