మూసీ ప్రాజెక్టుకు రూ 7 వేల కోట్ల నిధులు, 21 కిమీ రివర్ ఫ్రంట్.. ఉత్తర్వులు..!!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ మెగా ప్రాజెక్టు పనుల కోసం ఏకంగా రూ.7,345 కోట్ల నిధులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిధులను ప్రభుత్వం రెండు విధాలుగా సమర్చుకోనుంది. మొత్తం రూ.7,345.12 కోట్లలో ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) నుంచి రూ.4,500 కోట్ల భారీ రుణాన్ని తీసుకోనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి, పునరు జ్జీవన ప్రాజెక్టులో ఒక కీలక ముందడుగు పడింది. మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టుకు రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతులు ఇస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. జోన్-1ఏ, జోన్-1బీ ప్రాధాన్య కారిడార్లలో మూసీ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. సీఎం రేవంత్ మూసీ రివర్ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే ఏ మార్గాలను డెవలప్ చేయాలనే అంశం పైన నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగా హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 9.20 కి.మీ., ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 11.80 కి.మీ. మేర అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. మొత్తం 21 కి.మీ. ప్రాధాన్య స్ట్రెచ్‌లో రివర్‌ఫ్రంట్ పనులు జరుగనున్నాయి.

సీఎం రేవంత్ నిర్ణయంతో
ప్రభుత్వ తాజా నిర్ణయం మేకు భూసేకరణ వ్యయం మినహా రూ.7,345.12 కోట్లకు అనుమతి ఇచ్చింది. ఇందులో ఏడీబీ నుంచి రూ.4,500 కోట్ల రుణాన్ని తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. కాగా, మిగతా రూ.2,845.12 కోట్లు HMDA లేదా TGIIC నుంచి రుణం తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక.. మూసీ రివర్‌ఫ్రంట్ పనులను ఈపీసీ విధానంలో నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ప్రాజెక్టు పర్యవేక్షణకు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ నియామకానికి సర్కార్ ఆమోదం తెలుపుతూ ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు తదుపరి చర్యలు చేపట్టాలని ఎమ్‌ఆర్‌డీసీఎల్‌కు ప్రభుత్వం స్పష్టమైన మార్గనిర్దేశం చేసింది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మూసీ రివర్ విషయంలో రేవంత్ ప్రభుత్వం ఇక ముందుకే వెళ్లాలని డిసైడ్ అవ్వటంతో పాటుగా యాక్షన్ ప్లాన్ అమలుకు సిద్దం అవుతోంది.













Click it and Unblock the Notifications