పవన్ ను సీఎం చేస్తాం..! చంద్రబాబు మాజీ మిత్రుడి సంచలన ఆఫర్..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా రెండు సామాజిక వర్గాలకు మాత్రమే అత్యధిక సార్లు ముఖ్యమంత్రి పదవి దక్కింది. అలాగే ఏపీ విభజన తర్వాత కూడా రాష్ట్రంలో అవే రెండు సామాజిక వర్గాలకు రొటేషన్ మార్గంలో సీఎం పదవి చేతులు మారుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో సీఎం పీఠం కోసం ఎదురుచూస్తున్న మరో సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ ( Chinta Mohan) ఇవాళ సంచలన ఆఫర్ ఇచ్చారు.
ఆంధప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు కాపులు ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి కాలేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతామోహన్ తెలిపారు. సుమారు 20 శాతం జనాభా కలిగి, ఓటర్లలో అత్యధిక శాతం ఉన్న కాపు సామాజిక వర్గం రాజకీయంగా తీవ్ర నిర్లక్ష్యానికి, అణచివేతకు గురైందన్నారు. ముఖ్యమంత్రి పదవి ఒక్క రోజు కూడా అనుభవించలేదన్నారు. జగన్, చంద్రబాబు ఇరువురూ కాపులను ముఖ్యమంత్రిగా అంగీకరించరని, వారు లేదా వారి వారసులను మాత్రమే ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేసుకుంటారని తెలిపారు. కాపు సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే, ముఖ్యమంత్రి అవుతారని చింతామోహన్ పేర్కొన్నారు.

దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా కావాలని కోరుతున్నారని, వారు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే, తప్పకుండా అధికారంలోకి రాగానే, రాజ్యాంగ సవరణ చేసి, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇస్తామని చింతా మోహన్ ప్రకటించారు. బీజేపీ అవినీతిలో ముందంజలో ఉందన్నారు. అయోధ్య పేరుతో వేల కోట్ల రూపాయలు సేకరించి వాటిని దుర్వినియోగం చేశారని విమర్శించారు. నిధుల వినియోగంపై సిబిఐతో విచారణ జరిపించి, సుప్రీం కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో జయలలితకు ఒక న్యాయం? జగన్ కు మరో న్యాయమా? అని ప్రశ్నించారు. జగన్ కు మోడీ మద్దతు ఉందన్నారు. అందుకే కేసులు విచారణ ఆలస్యం అవుతోందన్నారు.













Click it and Unblock the Notifications