అల్లు అరవింద్, రష్మికకు యష్ స్ట్రాంగ్ కౌంటర్
కన్నడ సూపర్‌స్టార్ యాష్ నటించిన భారీ చిత్రం 'టాక్సిక్' ఈ నెల 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న యాష్, ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తనపై వచ్చిన వివాదాలు, విమర్శలపై స్పందిస్తూ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
షో ఆఫ్ హీరో అన్న రష్మిక
గతంలో రష్మిక మందన్న ఒక టాక్ షోలో తనను 'షో ఆఫ్ హీరో' అని కామెంట్ చేయడంపై యాష్ ఎంతో హుందాగా స్పందించాడు. ఆమె ఏ ఉద్దేశంతో ఆ మాటందో తనకు తెలియదని, కొన్నిసార్లు ఇంటర్వ్యూలలో యాంకర్లు ఇచ్చే ఆప్షన్ల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో అలా చెప్పాల్సి వచ్చి ఉండవచ్చని చాలా కూల్‌గా తేల్చేశాడు. అలాగే 'కేజీఎఫ్‌కు ముందు యష్ ఎవరో ఎవరికి తెలుసు?' అంటూ 2023లో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేసిన కామెంట్‌ను కూడా యాష్ చాలా పద్ధతిగా తిప్పికొట్టాడు.

అందరి కష్టం దాగుంటుంది
కేజీఎఫ్ సిరీస్ వల్ల తనకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిన మాట వాస్తవమేనని అంగీకరిస్తూనే, ఒక సినిమా విజయానికి సంబంధించిన క్రెడిట్ కేవలం నిర్మాత ఒక్కడికే చెందుతుందనడం సరికాదని స్పష్టం చేశాడు. ఆ విజయం వెనుక రైటర్ల నుండి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు వందలాది మంది చెమటోడ్చిన కష్టం దాగుందని పేర్కొన్నాడు. ప్రేక్షకులను దేవుళ్లతో పోల్చిన యాష్, ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలో సక్సెస్ క్రెడిట్ ఎవరికి దక్కాలో ప్రేక్షకులకు పక్కాగా తెలుసని అన్నాడు.
ప్రేక్షకుల తీర్పే ఫైనల్
అభిమానులు హీరోలనే ఎందుకు అంతలా ఆరాధిస్తారో ఒక్కోసారి అనిపిస్తుందని, కానీ ప్రేక్షకులు తీర్పు ఇవ్వడంలో ఎప్పుడూ విఫలం అవ్వలేదని తెలిపాడు. చివరగా, ప్రతి శుక్రవారం స్టార్ హీరోల తలరాతలు మారిపోతుంటాయని చెప్పిన యాష్, 'పాన్ ఇండియా హీరో' అనే ట్యాగ్ ఏ ఒక్కరికీ శాశ్వతం కాదని వ్యాఖ్యానించాడు.














Click it and Unblock the Notifications