El nino: దేశంలో మళ్లీ కరెంట్ కట్.. 8 రాష్ట్రాలలో విపరీతమైన కోతలు!

దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత మళ్లీ భయపెడుతోంది. ఎల్ నినో దెబ్బకి గడచిన మూడేళ్లలో ఎన్నడూ లేనంతగా అనేక రాష్ట్రాల్లో రాత్రి వేళల్లో విద్యుత్ కోతలు తీవ్రరూపం దాల్చాయి. పగటిపూట సోలార్ వెలుగులతో కాలం గడిచిపోతున్నా, సూర్యుడు అస్తమించగానే చీకట్లు ముసురుతున్నాయి. రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్ వంటి ప్రధాన రాష్ట్రాలతో పాటు దేశ రాజధాని ఢిల్లీ కూడా ఇప్పుడు అదనపు విద్యుత్ కావాలంటూ కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నాయి. ఒక్క పంజాబ్‌లోనే సెప్టెంబరు నెలలో ఏకంగా 14 గంటల పాటు కోతలు అమలుకావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ఈ రకమైన కరెంట్ కష్టాలకు ప్రధానంగా నీటి కొరతే కారణమని తెలుస్తోంది. ఎల్ నినో ప్రభావంతో అనుకున్న స్థాయిలో వర్షాలు పడకపోవడంతో డ్యాముల్లో నీటిమట్టాలు పడిపోయాయి. దీంతో జల విద్యుత్ ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే దాదాపు 20 శాతం తగ్గిపోయింది. సాధారణంగా రాష్ట్రాల్లో కొరత ఏర్పడినప్పుడు కేంద్రం తన వద్ద ఉన్న బొగ్గు, నీటి ఆధారిత విద్యుత్ నిల్వలను సుమారు 14 నుంచి 15 గిగావాట్లు నుంచి సర్దుబాటు చేస్తుంది. కానీ ఈసారి జల విద్యుత్ అందుబాటులో లేకపోవడంతో కేంద్రీయ కోటా ఖాళీ అయిపోయింది. ఒక రాష్ట్రానికి ఇవ్వాలంటే మరో రాష్ట్రానికి కోత పెట్టాల్సిన విపత్కర పరిస్థితి ఏర్పడింది.

India Power Shortage Hits 3-Year High 8 States and Delhi Request Urgent Electricity Supply Support
 సెప్టెంబర్ లోనూ వేసవి ఎండ, ఉక్కపోత.. కరెంట్ కోత: ఉక్కిరిబిక్కిరి- అప్పటి వరకు ఇంతే..!!
సెప్టెంబర్ లోనూ వేసవి ఎండ, ఉక్కపోత.. కరెంట్ కోత: ఉక్కిరిబిక్కిరి- అప్పటి వరకు ఇంతే..!!

బొగ్గు కొరత.. నిలిచిపోయిన విద్యుత్ కేంద్రాలు

మరోవైపు థర్మల్ విద్యుత్ కేంద్రాలు కూడా పూర్తిస్థాయిలో నడవడం లేదు. సాంకేతిక నిర్వహణ, మరమ్మతుల కారణంతో దేశవ్యాప్తంగా దాదాపు 41 గిగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లు మూతపడ్డాయి. దీనికితోడు దాదాపు సగానికి పైగా బొగ్గు ప్లాంట్లలో అవసరమైన స్థాయిలో బొగ్గు నిల్వలు లేవు. రికార్డు స్థాయిలో ప్లాంట్ల ఉత్పత్తి పెంచినప్పటికీ పెరిగిన డిమాండ్‌ను తట్టుకోలేకపోతున్నాయి. సెప్టెంబరు నెలలోనే దేశంలో విద్యుత్ కొరత 560 మిలియన్ కిలోవాట్ అవర్లకు చేరింది. ఇది 2023 ఆగస్టు తర్వాత అత్యధికం కావడం గమనార్హం.

1901 తర్వాత అత్యంత వేడి నెల.. దేశంలో కరెంట్ వాడకం ఆల్ టైమ్ హై!
1901 తర్వాత అత్యంత వేడి నెల.. దేశంలో కరెంట్ వాడకం ఆల్ టైమ్ హై!

సోలార్ వెలుగులు ఉన్నా సాయంత్రానికి చీకట్లే!

మన దేశంలో పునరుత్పాదక ఇంధన రంగాన్ని (సోలార్, విండ్) భారీగా విస్తరించినప్పటికీ, దాన్ని రాత్రి వేళల్లో వాడుకునే సరైన 'బ్యాటరీ స్టోరేజ్' వ్యవస్థలు లేకపోవడం పెద్ద శాపంగా మారింది. పగటిపూట తయారయ్యే సోలార్ విద్యుత్ అవసరానికి మించి అందుబాటులో ఉంటోంది. కానీ సాయంత్రం అయ్యేసరికి ఆ విద్యుత్‌ను నిల్వ ఉంచే సామర్థ్యం లేక వృథాగా పోతోంది. పరిశ్రమల వినియోగం పెరగడం, వేసవి తీవ్రత ఎక్కువ కాలం కొనసాగడంతో రాష్ట్రాల అంచనాలు తలకిందులయ్యాయి. ఓపెన్ మార్కెట్‌లో విద్యుత్ కొనుగోలు చేద్దామన్నా ధరలు ఆకాశాన్నంటుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేస్తున్నాయి. పునరుత్పాదక విద్యుత్ సంస్థలు వెంటనే బ్యాటరీ నిల్వ వ్యవస్థలను అందుబాటులోకి తేవాలని కేంద్రం ఒత్తిడి తెస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+