వాళ్లెవరో తెలియదు, మీ పిల్లల్ని పంపించకండి: విశాఖ కలెక్టర్, సీపీ
ప్రత్యేక హోదా కోసం ఈ నెల 26వ తేదీన సాయంత్రం విశాఖ బీచ్ రోడ్డులో నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, సీపీ యోగానంద్ మంగళవారం తెలిపారు.
విశాఖ: ప్రత్యేక హోదా కోసం ఈ నెల 26వ తేదీన సాయంత్రం విశాఖ బీచ్ రోడ్డులో నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, సీపీ యోగానంద్ మంగళవారం తెలిపారు.
అసలు ఇంతకు ఆ కార్యక్రమ నిర్వాహకులు ఎవరో తమకు తెలియదన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ కార్యక్రమానికి పంపించవద్దని సూచించారు. కాలేజీ యాజమాన్యాలు కూడా పంపించవద్దన్నారు.

ఈ నెల 27, 28 తేదీలలో విశాఖలో ప్రతిష్ట్మాతక పార్ట్‌నర్ షిప్ సమ్మిట్ ఉన్నందున ఎలాంటి ఆందోళన కార్యక్రమాలకు అనుమతి లేదన్నారు. ఎవరైనా అనుమతి కోసం దరఖాస్తు చేసినా ఇంత తక్కువ వ్యవధిలో ఇవ్వలేమన్నారు.












Click it and Unblock the Notifications