భారీ వర్షాలు, వరదలు: నష్టం అంచనా వేసేందుకు ఏపీకి కేంద్ర బృందం, రాష్ట్రాన్ని వీడని జోరువానలు

అమరావతి: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ నష్టం జరిగిన విషయం తెలిసిందే. ఈ నష్టాన్ని అంచనా వేసేందుకు రేపు అంటే శుక్రవారం కేంద్ర బృందం పర్యటించనుంది. సీఎం జగన్ రాసిన లేఖకు స్పందించిన కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపుతోంది.

ఏపీలోకి కేంద్ర బృందం, మూడు రోజుల పర్యటన

ఏపీలోకి కేంద్ర బృందం, మూడు రోజుల పర్యటన

కేంద్రం నుంచి వచ్చే ఏడుగురు సభ్యులు.. రెండు బృందాలుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. కేంద్ర హోంశాఖ సలహాదారు కునాల్ సత్యార్థి నేతృత్వంలో మూడు రోజులపాటు ఏపీలో కేంద్ర బృందం పర్యటించనుంది. నవంబర్ 26న చిత్తూరు, నవంబర్ 27న చిత్తూరు, కడప, 28న నెల్లూరు జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. నవంబర్ 29న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కేంద్ర బృందం భేటీ కానుంది.

ఏపీలో మరో మూడురోజులపాటు భారీ వర్షాలు

ఏపీలో మరో మూడురోజులపాటు భారీ వర్షాలు

ఇది ఇలావుండగా, ఇప్పటికే భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో మరో మూడురోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం శుక్రవారం నైరుతి బంగాళా ఖాతం, దక్షిణ శ్రీలంక తీరముకు దగ్గర్లో సగటు సముద్ర మట్టానికి 3 .1 కిలోమీటర్లు ఎత్తులో విస్తరించిఉంది. ఉపరితల ఆవర్తనమునకు అనుభందముగా ఉపరితల ద్రోణి నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీంతో దక్షిణ అండమాన్ సముద్రంలో నవంబర్ 29 వ తేదీనాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు

ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో గురువారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. శుక్రవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. శనివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చొట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవ

Recommended Video

    Weather : Heavy Rains Till Oct 17 Due To Low Pressure || Oneindia Telugu
    దక్షణి కోస్తా, రాయలసీమలోనూ సాధరణ నుంచి భారీ వర్షాలు

    దక్షణి కోస్తా, రాయలసీమలోనూ సాధరణ నుంచి భారీ వర్షాలు

    దక్షిణ కోస్తాంధ్రలో గురువారం తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముంది. మరోవైపు రాయలసీమ ప్రాంతంలో గురువారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. శుక్రవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముంది. శనివారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+