విశాఖలో వండర్ కిడ్స్ రికార్డు (పిక్చర్స్)
విశాఖపట్నం: వంద ప్రశ్నలకు 30 మంది చిన్నారులు కేవలం 10 నిమిషాల 20 సెకన్లలో సమాధానాలు చెప్పి రికార్డు సృష్టించారు. విశాఖపట్నంలోని కళాభారతి ఆడిటోరియంలో బుధవారం స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ విద్యార్థులు ఈ రికార్డును సాధించారు. రెండో తరగతి లెక్కల ప్రశ్నాపత్రం ప్రశ్నలకు యుకెజి చిన్నారులు సమాధాలు చెప్పి ఆశ్చర్యపర్చారు.
ఏయూ వైస్ ఛాన్స్‌లర్ జిఎస్ఎన్ రాజు, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికార ప్రతినిధి భరద్వాజ్, ఏయూ ఆచార్యుల సమక్షంలో వందప్రశ్నలకు చిన్నారులు సమాధానాలిచ్చారు. వంద ప్రశ్నలను ఎల్ఈడి తెర ద్వారా ప్రెజెంటేషన్ చేసి వాటి సమాధానాలను యుకెజి చిన్నారులను అడిగారు. విద్యార్థులు ఎలాంటి తడబాటు లేకుండా అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
దీంతో చిన్నారుల రికార్డును ధృవీకరిస్తూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికార ప్రతినిధి భరద్వాజ్ పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యుకెజి చిన్నారులు వంద ప్రశ్నలకు 10 నిమిషాల 20 సెకన్లలో సమాధానాలు చెప్పడం అద్భుతమని అన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఏయూ వీసీ జిఎస్ఎన్ రాజు అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ మళ్ల రామానాయుడు, ఏయూ ఆచార్యులు రంగారావు, మునిస్వామి, మదన్మోహన్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పృథ్వీరాజ్, స్కూల్ ప్రిన్సిపాల్ వాణిశ్రీ, తదితరులు పాల్గొన్నారు.

వండర్ కిడ్స్
వంద ప్రశ్నలు.. 30 మంది చిన్నారులు.. 10 నిమిషాల 20 సెకన్లలో సమాధానాలు చెప్పి రికార్డు సృష్టించారు.

వండర్ కిడ్స్
విశాఖపట్నంలోని కళాభారతి ఆడిటోరియంలో బుధవారం స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ విద్యార్థులు ఈ రికార్డును సాధించారు.

వండర్ కిడ్స్
రెండో తరగతి లెక్కల ప్రశ్నాపత్రం ప్రశ్నలకు యుకెజి చిన్నారులు సమాధాలు చెప్పి ఆశ్చర్యపర్చారు.

వండర్ కిడ్స్
ఏయూ వైస్ ఛాన్స్‌లర్ జిఎస్ఎన్ రాజు, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికార ప్రతినిధి భరద్వాజ్, ఏయూ ఆచార్యుల సమక్షంలో వందప్రశ్నలకు చిన్నారులు సమాధానాలిచ్చారు.

వండర్ కిడ్స్
వంద ప్రశ్నలను ఎల్ఈడి తెర ద్వారా ప్రెజెంటేషన్ చేసి వాటి సమాధానాలను యుకెజి చిన్నారులను అడిగారు.

వండర్ కిడ్స్
విద్యార్థులు ఎలాంటి తడబాటు లేకుండా అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

వండర్ కిడ్స్
దీంతో చిన్నారుల రికార్డును ధృవీకరిస్తూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికార ప్రతినిధి భరద్వాజ్ పత్రాన్ని అందించారు.












Click it and Unblock the Notifications