చిలకలూరిపేట ఎస్సైపై వేటు.. విడదల రజిని ఘటనపై ఎస్ఈసీ సీరియస్

రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేళ ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో శుక్రవారం మధ్యాహ్నం తీవ్ర కలకలం రేపిన ఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అత్యంత తీవ్రంగా స్పందించింది. నామినేషన్ పత్రాలు, బి-ఫామ్ అందజేసేందుకు తన నివాసం నుంచి బయటకు వస్తున్న మాజీ మంత్రి విడదల రజినిని అడ్డుకోవడమే కాకుండా, ఆమెపై దురుసుగా వ్యవహరించి కిందకు తోసేసిన చిలకలూరిపేట రూరల్ ఎస్సై లేఖా ప్రియాంకపై ఎస్ఈసీ సీరియస్ అయింది.

మాజీ మంత్రి విడదల రజినిని తోసివేయడంతో ఆమె కిందపడిన ఘటనకు సంబంధించిన వీడియోలు, మీడియా కథనాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్ఈసీ, ఎస్సై ప్రియాంకను తక్షణమే విధుల నుంచి తొలగించాలని పల్నాడు జిల్లా ఎస్పీని ఆదేశించింది. రాబోయే ఎన్నికల డ్యూటీలతో పాటు అన్ని రకాల పోలీసు విధులనుంచి ఆమెను తప్పించాలని స్పష్టం చేసింది. ఈ ఘటనపై నిర్ణీత గడువులోగా సమగ్ర విచారణ జరిపి, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను పరిశీలించి నివేదిక అందించాలని సూచించింది.

Andhra Pradesh SEC Orders Strict Action On Chilakaluripet SI Priyanka After High Drama Over Vidadala Rajini
Live Video: విడదల రజనిని కింద పడేసిన ఎస్సై.. చిలకలూరిపేటలో హైటన్షన్
Live Video: విడదల రజనిని కింద పడేసిన ఎస్సై.. చిలకలూరిపేటలో హైటన్షన్

గత మూడు రోజులుగా తనను ఇంటి నుంచి బయటకు రానీయకుండా గృహనిర్బంధం చేయడంపై రజిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు పంపించారు నిన్ను ఇక్కడికి? పిచ్చి పట్టిందా నీకు? చంపుతావా మమ్మల్ని? గత మూడు రోజుల నుంచి బయటకు రానివ్వడం లేదు.. ఏం మెంటలా నీకు? ఎవడు పంపించాడు నిన్ను? ఎక్కువ చేస్తున్నావ్.. నీ లిమిట్స్ లో నువ్వు ఉండు. అసలు ఆడదానివేనా? ఏం మనిషివి నువ్వు? మా నాయకుడిని ఆపడానికి నువ్వు ఎవరు? నేను బి-ఫామ్ ఇవ్వాలి, ఆయన్ను లోపలికి రమ్మను" అంటూ నిప్పులు చెరిగారు.

మళ్లీ సుప్రీంకోర్టుకు వైసీపీ, నామినేషన్లు..ఆధారాలు - కీలక మలుపు..!!
మళ్లీ సుప్రీంకోర్టుకు వైసీపీ, నామినేషన్లు..ఆధారాలు - కీలక మలుపు..!!

అన్నమయ్య జిల్లా అధికారులపైనా వేటు

ఇలాంటి ఘటనలే అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మండలం మొలకలచెరువు ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్ల దాఖలును అడ్డుకున్న ఉదంతంలోనూ చోటుచేసుకున్నాయి. ఎన్నికల విధుల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సర్కిల్ ఇన్ స్పెక్టర్ కె. దస్తగిరి, ఎస్సై పి. రామకృష్ణల నిర్లక్ష్యంపై రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ఏపీ సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం వారిని ఎన్నికల విధులతో పాటు క్రమశిక్షణా చర్యల కింద తక్షణమే సస్పెండ్ చేస్తూ ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సమయంలో ఏ స్థాయి అధికారినైనా సరే, విధుల్లో పక్షపాత ధోరణి ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఈసీ తాజా ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+