నాలుగు జోన్లుగా ఏపీ విభజన: ప్రాంతీయ అభివృద్ధి బోర్డులు: మంత్రివర్గ భేటీలో చర్చ: ఆమోదించే ఛాన్స్..?

అమరావతి: రాష్ట్రానికి అమరావతి సహా మూడు రాజధానులను ప్రకటించిన తరువాత నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఏర్పాటైన మంత్రివర్గ సమావేశంపై అందరి దృష్టీ నిలిచింది. మూడు రాజధానుల ప్రకటన అనంతరం అమరావతి ప్రాంత రైతులు పదిరోజులుగా నిరనలు ప్రదర్శనలు, నిరాహార దీక్షలు, బైఠాయింపులకు దిగిన ప్రస్తుత పరిస్థితుల్లో మంత్రివర్గ సమావేశంలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారనే అంశంపై ఆసక్తి నెలకొంది. రాజధాని అమరావతి ప్రాంతంలోని వెలగపూడిలో గల తాత్కాలిక సచివాలయంలో ప్రస్తుతం మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది.

నాలుగు జోన్లుగా..

నాలుగు జోన్లుగా..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి మూడు రాజధానులను ప్రకటించిన విధంగానే.. రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా విభజించే అవకాశాలు లేకపోలేదు. ఈ అంశంపై మంత్రివర్గం సమావేశంలో విస్తృతంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా విభజించే అంశాన్ని మంత్రివర్గ సమావేశం అజెండాలో చేర్చినట్లు చెబుతున్నారు. దీనితో పాటు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లను కూడా ఏర్పాటు చేయాలనే దిశగా మంత్రివర్గం చర్చిస్తున్నట్లు సమాచారం.

నాలుగు జోన్లు.. ఇలా..

నాలుగు జోన్లు.. ఇలా..

ప్రాంతాలు, జిల్లాల వారీగా నాలుగు జోన్లను విభజించినట్లు చెబుతున్నారు. నిజానికి- ఇప్పుడున్న భౌగోళిక స్వరూపం ప్రకారం.. మూడు ప్రాంతాలుగా వర్గీకరించారు. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమగా వాడుకలో ఉంది మన రాష్ట్రం. తాజాగా- కోస్తా ప్రాంతాన్ని విడగొట్టినట్లు తెలుస్తోంది. కోస్తా జిల్లాలను రెండు మధ్య కోస్తా, దక్షిణ కోస్తా జోన్లుగా విభజించారని అంటున్నారు. ఉత్తరాంధ్ర జోన్ పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను చేర్చారు. అలాగే- తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలను మధ్య కోస్తా పరిధిలోకి తీసుకొచ్చారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కలిపి దక్షిణ కోస్తాగా మార్చే అవకాశాలు ఉన్నాయి. ఇక మిగిలిన కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలను రాయలసీమ జోన్ పరిధిలోకి తీసుకొచ్చినట్లు సమాచారం.

 ప్రాంతీయ అభివృద్ధి మండళ్లకు అవకాశం..

ప్రాంతీయ అభివృద్ధి మండళ్లకు అవకాశం..

నాలుగు జోన్లుగా విభజించిన అనంతరం.. వాటిని సమగ్రంగా అభివృద్ధి పర్చడానికి ప్రాంతీయ అభివృద్ధి మండళ్లను నెలకొల్పవచ్చని తెలుస్తోంది. జోన్లు, ప్రాంతాలవారీగా అభివృద్ధి మండళ్లను నెలకొల్పుతారని, ఫలితంగా అభివృద్ధిలో ఎలాంటి అసమానతలు అవకాశం లేకుండా చేయాలనేది ప్రభుత్వ వ్యూహమని అంటున్నారు. ప్రాంతీయ అభివృద్ధి మండళ్లను ఎన్ని ఏర్పాటు చేయాలనేది ఇంకా తేలాల్సి ఉందని అంటున్నారు.

మంత్రివర్గ భేటీ తరువాతే..

మంత్రివర్గ భేటీ తరువాతే..

ఉత్తరాంధ్ర, రాయలసీమలకు వేర్వేరుగా అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేస్తారు. కోస్తా కోసం రెండింటిని ఏర్పాటు చేయాలా? లేక రెండింటినీ కలిపి ఒకే గొడుగు కిందికి తీసుకుని రావాలా? అనే అంశంపై చర్చిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రాంతీయ అభివృద్ధి మండళ్ల ఏర్పాటుపై గానీ, నాలుగు జోన్లుగా రాష్ట్రాన్ని విభజించే అంశంపై గానీ మంత్రివర్గ సమావేశం ముగిసిన తరువాతే ఓ స్పష్టత వస్తుంది. ప్రాంతీయ అసమానతలను నివారించడానికి ఇదొక్కటే మార్గమనే అభిప్రాయాన్ని మంత్రులు వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+