ఏపీలో కొత్త జిల్లా పరిషత్‌లు, పునర్విభజన ఇలా - ఉత్తర్వులు... కలిసొచ్చేదెవరికి..!!

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల దిశగా ప్రభుత్వం.. ఎన్నికల సంఘం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. రాజకీయ పార్టీలు సైతం తమ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. ముందుగా మున్సిపల్ తరువాత జిల్లా పరిషత్ ఎన్నికలకు వీలుగా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. ఈ క్రమంలోనే జిల్లా పరిషత్ ల సంఖ్య పెంపు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొత్తగా 15 జెడ్పీలు ఏర్పడనున్నాయి. దీంతో.. ఈ నిర్ణయం రాజకీయంగా పార్టీల పైన ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.

ఏపీలో స్థానిక ఎన్నికల వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న 13 జడ్పీల స్థానంలో 28 కొత్త జడ్పీలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పడిన మార్కాపురం, పోలవరం జిల్లాలకు సైతం జడ్పీల మంజూరు చేసింది. కొత్త జిల్లా పరిషత్‌ల నిర్వహణ కోసం 30 కీలక పోస్టులపై దృష్టి సారిస్తుంది. అదనంగా 15 జడ్పీ సీఈవో, 15 డిప్యూటీ సీఈవో పోస్టుల ఏర్పాటుకు ఆమోదించింది. ఈ నెల 24తో ప్రస్తుత జడ్పీ పాలకవర్గాల పదవీకాలం ముగియనుంది. గడువు ముగిసిన వెంటనే 28 కొత్త జడ్పీల వ్యవస్థ అమల్లోకి రానుంది. 660 మండలాలను కొత్త జడ్పీల పరిధిలోకి మ్యాపింగ్ చేయాలని ఆదేశించింది. కాగా, పనిభారం ఆధారంగా ప్రస్తుత సిబ్బందినే కొత్త జడ్పీలకు ప్రభుత్వం సర్దుబాటు చేయనుంది. అయితే.. మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యే లోగా జిల్లా పరిషత్‌ల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేసేందుకు ఆలోచన చేస్తున్నారు.

 ఈ తేదీల్లో పలు ప్రధాన రైళ్ల రద్దు - చెన్నై, బెంగళూరు వెళ్లే రైళ్ల రీ షెడ్యూల్.. వివరాలు..!!
ఈ తేదీల్లో పలు ప్రధాన రైళ్ల రద్దు - చెన్నై, బెంగళూరు వెళ్లే రైళ్ల రీ షెడ్యూల్.. వివరాలు..!!
andhra-pradesh-to-get-28-zilla-parishads-as-district-reorganisation-takes-effect-orders-issued

సమాయత్తం అవుతున్న రాజకీయ పార్టీలు

ఇప్పటికే కూటమి- వైసీపీ స్థానిక ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ముందుగా మున్సిపల్.. ఆ తరువాత పంచాయితీ ఎన్నికల వీలు గా కసరత్తు కొనసాగుతోంది. కొత్త వార్డుల ప్రక్రియకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నెల 15వ తేదీ నుంచి ఏ క్షణం లో అయినా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం కనిపిస్తోంది. అవి పూర్తయిన తరువాత జెడ్పీ ఎన్నికల దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్ల జాబితాలు సిద్దం అయ్యాయి. ప్రభుత్వం అక్టోబర్ నెలాఖరు నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉంది. అయితే.. కోర్టు కేసులను పరిష్కరించుకొని ముందుకు వెళ్లాల్సి ఉండంతో... నిర్ణీత గడువు లోగా పూర్తి చేస్తారా.. మరింత సమయం తీసుకుంటారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. అయితే, కొత్త నిర్ణయాలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు తమ వ్యూహాలతో సిద్దం అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+