సురేఖ అడుగులు ఆ పార్టీ వైపే, కండీషన్స్ అప్లై - కీలక మంత్రాంగం..!!

కొండా సురేఖ వ్యవహారం లో కీలక మలుపు. భవిష్యత్ కార్యాచరణ పైన సురేఖ కీలక మంత్రాంగం చేస్తున్నారు. కాంగ్రెస్ వీడనని చెప్పినా.. పార్టీలో గతంలో లాగా కొనసాగే పరిస్థితులు లేవని కొండా దంపతులు భావిస్తున్నారు. ఈ క్రమంలో రాజకీయంగా ఇతర పార్టీల నుంచి ఆహ్వానాలు వస్తున్న నేపథ్యంలో కీలక మద్దతు దారుల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. సురేఖ తన రాజకీయ భవితవ్యం పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

కొండా సురేఖ దారెటు. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయంగా ఆసక్తి రేపుతున్న అంశం. కొండా సురేఖ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన తరువాత తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేసినా ఎంత కాలం కంటిన్యూ అవుతారనేది సందేహంగానే ఉంది. గత కొంత కాలంగా సురేఖ వ్యవహారం వివాదంగా మారిన తరువాత ఇతర పార్టీల నేతలు సురేఖ తో టచ్ లోకి వచ్చారు. తన కుమార్తె రాజకీయ భవితవ్యం కోసమే కొండా దంపతులు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగం గా సుస్మిత ను బీజేపీలో చేరేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆ పార్టీ నేతల నుంచి ఇప్పటికే సంకేతాలు అందినట్లు సమాచారం. అదే విధంగా కొండా దంపతులు బీజేపీలో చేరాలంటే తమ కు అభ్యంతరం లేదని.. చెబుతూనే కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీలోనే బీజేపీ అధి నాయకత్వంలో పార్టీ చేరే విధంగా కొండా దంపతులు కోరుకుంటున్నారని ప్రచారం సాగుతోంది.

మాజీ సీఎం కు తెలంగాణ బాధ్యతలు- రాహుల్ ఆకస్మిక నిర్ణయం వెనుక, ఇక నుంచి..!!
మాజీ సీఎం కు తెలంగాణ బాధ్యతలు- రాహుల్ ఆకస్మిక నిర్ణయం వెనుక, ఇక నుంచి..!!
konda-surekha-holds-key-discussions-with-supporters-big-political-decision-likely-here-the-detail

కొండా కీలక మంత్రాంగం.. కార్యాచరణ

కొండా దంపతులు బీజేపీకి రావటానికి రాష్ట్ర పార్టీ నేతలు సానుకూలంగానే ఉన్నారు. ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు.. ఎంపీలు సైతం సురేఖ తమ పార్టీలోకి వస్తే అభ్యంతరం లేదని వ్యాఖ్యలు చేస్తున్నారు. కొండా సురేఖ తిరిగి బీఆర్‌ఎస్ వైపు వెళ్లే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది. ఆమెను పార్టీలోకి రానిచ్చే ప్రసక్తే లేదని, తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వమని బీఆర్‌ఎస్ ముఖ్య నేత జగదీష్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. కాగా.. తాజాగా ఒక బీసీ మహిళా మంత్రిని ఇలా తొలగించడం సరికాదంటూ బీజేపీ నేతలు డికే అరుణ, రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. కొండా దంపతులు నేరుగా తమను సంప్రదించనప్పటికీ, వారు బీజేపీలో చేరాలనుకుంటే హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని వారు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆమె అడుగులు బీజేపీ వైపు పడే అవకాశం ఉందనే ప్రచారం బలంగా వినిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+