సౌదీలో చిక్కుకున్న ఏపీ ఉమ్రా యాత్రికులు.. ఈ రాత్రికి జిద్దా నుంచి..

పశ్చిమాసియాలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు, భద్రతా కారణాల దృష్ట్యా అంతర్జాతీయ విమాన సర్వీసులు హఠాత్తుగా రద్దు కావడంతో సౌదీ అరేబియాలో పవిత్ర ఉమ్రా యాత్రకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సౌదీలో చిక్కుకుపోయిన సుమారు 253 మంది ఏపీ యాత్రికుల సంక్షేమాన్ని ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. వీరితో పాటు విజయవాడకు చెందిన న్యూ రాయల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా వెళ్లిన 40 మంది యాత్రికుల కోసం ఒక ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. ఈ విమానం ఆదివారం రాత్రి జిద్దా నుంచి బయలుదేరి సోమవారం ఉదయం 7 గంటలకు హైదరాబాద్ చేరుకోనుంది.

సౌదీలో వేలాది మంది భారతీయులు.. తెలుగు రాష్ట్రాల నుంచే 1,500 మంది!

అందుతున్న అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం సౌదీ అరేబియాలో దాదాపు 3,000 మంది భారతీయ ఉమ్రా యాత్రికులు ఉన్నారు. అందులో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందినవారే సుమారు 1,500 మంది వరకు ఉన్నట్లు అంచనా. కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే సుమారు 400 నుంచి 500 మంది యాత్రికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గుర్తించిన 253 మంది ఏపీ యాత్రికులతో APNRTS ప్రతినిధులు నిరంతరం మట్లాడుతూ, వారి భద్రత, వసతి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా, దమ్మామ్ నుంచి హైదరాబాద్‌కు చార్టర్డ్ విమానం నడిపేందుకు విమానయాన సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

Andhra Pradesh Umrah Pilgrims Stranded in Saudi Arabia Special Flight arranged to Fly Back 40 to Hyderabad
సౌదీ అరేబియా ఎయిర్ పోర్టులు, ఆయిల్ రిఫైనరీలు, పైప్ లైన్లపై హౌతీలు భారీ దాడులు
సౌదీ అరేబియా ఎయిర్ పోర్టులు, ఆయిల్ రిఫైనరీలు, పైప్ లైన్లపై హౌతీలు భారీ దాడులు

హృదయవిదారక పరిస్థితి.. కుటుంబ సభ్యుల్లో క్షణక్షణం భయం!

గత అక్టోబరు 6న ఉమ్రా యాత్రకు వెళ్లిన తమ తల్లిదండ్రులు, బంధువులు అక్కడ విమానాలు రద్దయి చిక్కుకుపోవడంతో మంగళగిరికి చెందిన వైసీపీ నేతలతో పాటు పలు కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందాయి. అయితే విదేశాంగ శాఖ, ఎంబసీ అధికారుల చొరవతో వారికి భోజనం, వసతి సౌకర్యాలు లభిస్తున్నాయని తెలిశాక కుటుంబ సభ్యులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. విజయవాడ ట్రావెల్స్ ఏజెన్సీ ప్రతినిధులు స్పందిస్తూ, ప్రత్యేక విమానం ద్వారా తమ బ్యాచ్‌కు చెందిన 40 మంది ప్రయాణికులను క్షేమంగా స్వదేశానికి రప్పిస్తున్నట్లు స్పష్టం చేశారు.

Umrah Visa: ఉమ్రా భక్తులకు షాక్, ఇక ఇలా మక్కా వెళ్లలేరు.. సౌదీ కొత్త రూల్
Umrah Visa: ఉమ్రా భక్తులకు షాక్, ఇక ఇలా మక్కా వెళ్లలేరు.. సౌదీ కొత్త రూల్

కేంద్ర ప్రభుత్వానికి వినతులు.. ఫైన్లు మినహాయించాలని విజ్ఞప్తి!

మరోవైపు ఈ సంక్షోభంపై బీజేపీ ఏపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు సయ్యద్ బాషా స్పందించారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజుకు అత్యవసర లేఖ రాశారు. సౌదీలో చిక్కుకున్న భారతీయ యాత్రికులను తక్షణమే స్వదేశానికి రప్పించేందుకు పౌరవిమానయాన శాఖతో సమన్వయం చేసుకుని చార్టర్డ్ విమానాలు ఏర్పాటు చేయాలని కోరారు. మక్కా, జిద్దాల్లో సహాయక కేంద్రాలను నిరంతరం అందుబాటులో ఉంచాలని, విమానాలు రద్దవ్వడం వల్ల వీసా గడువు ముగిసిన యాత్రికులపై ఎలాంటి జరిమానాలు విసిరేయకుండా సౌదీ అధికారులతో మాట్లాడాలని కోరారు.

సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం (రియాద్), కాన్సులేట్ జనరల్ (జిద్దా) యాత్రికులకు వైద్యం, వసతి సదుపాయాలు కల్పిస్తూ సురక్షితంగా మాతృభూమికి చేర్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+