బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. కొన్ని గంటల్లో భారీ వర్షాలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా - పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. గురువారం ఉదయం నాటికి ఇది బలమైన అల్పపీడన ప్రాంతంగా మారినట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని, ఇది రాబోయే రెండు రోజుల్లో ఒడిశా, పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు మహారాష్ట్ర, తెలంగాణ మీదుగా కోస్తాధ్రప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Andhra Pradesh Weather Update Low Pressure Intensifies to Bring Heavy Rains for Next Three Days

ఉత్తర కోస్తాంధ్ర పరిధిలో..

బలమైన అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో నేడు (గురువారం) ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు. ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది.

ఏపీకి వరుణుడి శుభవార్త... మూడురోజులు వర్షాలు.. ఎక్కడంటే!
ఏపీకి వరుణుడి శుభవార్త... మూడురోజులు వర్షాలు.. ఎక్కడంటే!

అయితే, కొన్ని ప్రాంతాల్లో వడగాలులు కూడా వీచవచ్చు. శుక్రవారం నాడు కూడా కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, మెరుపులు వచ్చే అవకాశం ఉండగా, ఉక్కపోత, వేడి, అసౌకర్య వాతావరణం ఉంటుంది. ఎల్లుండి (శనివారం) కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడతాయని, 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.

దక్షిణ కోస్తాంధ్రలో వాతావరణం

దక్షిణ కోస్తా జిల్లాల్లో ఇవాళ వాతావరణం భిన్నంగా ఉండనుంది. ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉండగా, బలమైన గాలులతో పాటు ఒకటి రెండు చోట్ల వడగాలులు వీచే అవకాశం ఉంది. శుక్ర, శనివారాల్లో మాత్రం ఈ ప్రాంతంలో వర్షాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అయితే, వర్షాలు పడినప్పటికీ పగటిపూట వేడి, తేమ పెరిగి అసౌకర్యవంతమైన వాతావరణ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది.

రుతుపవనాల విశ్వరూపం.. విస్తరించిన భారీ వర్షపు మేఘాల వరుస!
రుతుపవనాల విశ్వరూపం.. విస్తరించిన భారీ వర్షపు మేఘాల వరుస!

రాయలసీమ జిల్లాలో ఎలా ఉండబోతోంది?

రాయలసీమ రీజియన్‌లో రాగల మూడు రోజుల పాటు అక్కడక్కడా మాత్రమే జల్లులు కురిసే అవకాశం ఉంది. నేడు ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి వర్షాలు పడవచ్చు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచడంతో పాటు కొన్ని చోట్ల వడగాలుల ప్రభావం ఉంటుంది. శుక్రవారం నాడు కూడా ఇదే తరహాలో ఒకటి రెండు చోట్ల జల్లులు పడే అవకాశం ఉండగా, ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. శనివారం నాటికి గాలుల వేగం కొద్దిగా తగ్గి గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడవచ్చని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+